ఐపీఎల్ 2018 అభిమానుల ఆశించిన దానికన్నా చాలా గొప్పగా ప్రారంభమయింది. తొలి మేచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కేవలం ఒక్క వికెట్‌తో ఆఖరి ఓవర్లో ముంబై నిన్ను ఓడించడం ఎందరినో ఆసక్తికి గురి చేసింది.
అయితే ఆదివారం రెండు మ్యాచ్ లు ఉండటం అభిమానుల్లో మరింత ఉత్సాహం ఉంది. రాత్రి ఎనిమిది గంటలకు ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఐపీఎల్ చరిత్రలో బాగా అభిమానులు కలిగిన టాప్ జట్లలో ఈ రెండు కూడా ఉన్నాయి.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
ఈ ఏడాది ఆక్షన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం చాలా చక్కగా వ్యవహరించి, జట్టుకు మంచి సమతుల్యం వచ్చేలా చూశారు. అయితే విరాట్ కోహ్లీ ఏబీ డివిలియర్స్ వారి జట్టులో ఉండడంతో వారి బ్యాటింగ్ ఎప్పటిలానే చాలా పట్టిష్టంగా ఉంది.

జట్టులో చాలా మంది నూతన ఆటగాళ్లు వచ్చినప్పటికీ, బ్రెండన్ మెక్కలం పార్థివ్ పటేల్ లాంటి వారితో వారి టాప్ ఆర్డర్ గట్టిగానే ఉంది. అయితే వారి చరిత్రలోనే ఈ సారి బౌలింగ్ చాలా గట్టిగా ఉండటం విశేషం.
యుజ్వేంద్ర చాహాల్, వాషింగ్టన్ సుందర్ లతో వారి స్పిన్ విభాగం ఢోకా లేకుండా కనపడుతుంది. మరోవైపు క్రిస్ వోక్స్ కోలిన్ డి గ్రాండ్‌హోమ్ లాంటి ఆల్ రౌండర్లు ఉండనే ఉన్నారు.
రాయల్ చాలెంజర్స్ అంచనా XI: పార్థివ్ పటేల్ బ్రెండన్ మెక్కలం విరాట్ కోహ్లీ ఏబీ డివిలియర్స్ సర్ఫరాజ్ ఖాన్ క్రిస్ వోక్స్ కోలిన్ డి గ్రాండ్ వాషింగ్టన్ సుందర్ పవన్ నెగి యుజ్వేంద్ర చాహాల్ ఉమేష్ యాదవ్
కోల్ కతా నైట్ రైడర్స్
ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ ను గాయంతో కోల్పోయిన తరువాత కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు కాస్త బలహీనంగానే కనపడుతుంది. అయితే తమదైన రోజు చెలరేగి మ్యాచ్ విన్నర్స్ కలిగి ఉండడంతో వారి జట్టుపై తక్కువ అంచనా వేయడం తప్పే అవుతుంది.
బ్యాటింగ్ లో క్రిస్ లిన్ రాబిన్ తప్ప దినేష్ కార్తిక్ నితీష్ రాణా వంటి వారు ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. అలానే పట్టిష్టమైన ఆల్ రౌండర్లు ఆండ్రీ రసెల్ సునీల్ నరైన్ ఉండడం జట్టుకు మరింత బలం చేకూర్చనున్నాయి. మిచెల్ జాన్సన్ పయ్యావుల కుల్దీప్ యాదవ్ లాంటి బౌలర్లతో జట్టు బాగానే ఉంది.
కోల్ కతా నైట్ రైడర్స్ అంచనా XI: క్రిస్ లిన్ శుభ్‌మన్ గిల్ రాబిన్ ఉతప్ప దినేష్ కార్తిక్ నితీశ్ రాణా ఆండ్రీ రసెల్ సునీల్ నరైన్ పియూష్ చావ్లా మిచ్చెల్ జాన్సన్ వినయ్ కుమార్ కుల్దీప్ యాదవ్
మ్యాచ్ అంచనా: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు అయితే కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టును ఈడెన్ గార్డెన్స్ లో ఓడించడం అంత తేలికైన విషయం కాదు.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఈ మ్యాచ్ లో విజయం స్వల్ప తేడాతో గెలిచే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.