ఐపీఎల్.. ఈ పేరు వినగానే భారత క్రికెట్ అభిమానులకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఈ టోర్నమెంటు సాగుతుండటంతో ప్రతీ ఏటా ఐపీఎల్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు క్రికెట్ లవర్స్. ఇక ఈ యేడు ఐపీఎల్ మొదలయ్యి ఇప్పటికే 9 రోజులు పూర్తయ్యింది. ఏప్రిల్ 7న ప్రారంభం అయిన ఐపీఎల్ 2018లో ఇప్పటివరకు ఏ జట్టు ఎలాంటి పాయింట్స్ సాధించిందో చూద్దామా.

మొత్తం ఎనిమిది జట్లున్న ఐపీఎల్ టోర్నీలో ఇప్పటి వరకు ప్రతి ఒక్క టీమ్ 3 మ్యాచులు ఆడాయి. దీంట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మూడు మ్యాచ్‌లకు మూడు విజయాలతో 6 పాయింట్లు సాధించి లిస్టులో టాప్ 1వ స్థానంలో నిలిచింది. ఆదివారం రోజున జరిగిన మ్యాచ్‌లో విజయాన్ని సొంతం చేసుకున్న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ టీమ్ 4 పాయింట్లతో 2వ స్థానంలో నిలిచింది. ఇదే మ్యాచ్‌లో ఓడిపోయిన్ చెన్నై సూపర్ కింగ్స్ 4 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచింది.

రాజస్థాన్ రాయల్స్ కూడా 4 పాయింట్లతో 4వ స్థానాన్ని సొంతం చేసుకోగా కోల్‌కత్తా నైట్‌రైడర్స్ 2 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచింది. ఆడిన మూడు మ్యాచుల్లో కేవలం ఒకే విజయంతో 2 పాయింట్లు సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6వ స్థానంలో నిలవగా అదే 2 పాయింట్లు సాధించిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ 7వ స్థానంలో నిలిచింది. కాగా ఆడిన మూడు మ్యాచుల్లో ఇంకా బోణి కూడా చేయలేకపోయిన ముంబయి ఇండియన్స్ 0 పాయింట్లతో చివరిదైన 8వ స్థానంలో నిలిచింది.

ఇలా ప్రతి రోజు జరిగే మ్యాచులతో ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ను పంచడమే కాకుండా తమ రన్‌రేట్‌ను సైతం పెంచుకుంటూ పాయింట్లు సాధిస్తున్నాయి ఈ ఎనిమిది జట్లు. ఇక ఈ జట్ల రన్‌రేట్ ఈ కింద తెలిపిన విధంగా ఉన్నాయి.

1. హైదరాబాద్ – 6 పాయింట్లు (+0.772 రన్‌రేటు)
2. పంజాబ్ – 4 పాయింట్లు (+0.116 రన్‌రేటు)
3. చెన్నై – 4 పాయింట్లు (+0.103 రన్‌రేటు)
4. రాజస్థాన్ – 4 పాయింట్లు (-0.247 రన్‌రేటు)
5. కోల్‌కత్తా – 2 పాయింట్లు (-0.051 రన్‌రేటు)
6. బెంగళూరు – 2 పాయింట్లు (-0.373 రన్‌రేటు)
7. ఢిల్లీ – 2 పాయింట్లు (-0.461 రన్‌రేటు)
8. ముంబై – 0 పాయింట్లు (-0.174 రన్‌రేటు)

SHARE