ఎం ఎస్ ధోని లేని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ని ఊహిచుకోవడం చాలా కష్టమైన విషయమే. ఐపిఎల్ ప్రారంభం నుంచి చెన్నై జట్టులో ముఖ్య పాత్ర పోషించాడు ధోని. ఆయన సూపర్ కింగ్స్ ను రెండు సార్లు ఐపిఎల్ ఛాంపియన్లు గా నిలబెట్టాడు.

కేవలం రెండు సార్లు విజేతగానే నిలబడడం కాకుండా ఐపిఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిపాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన మొదటి 8 సీజన్ లలోను ప్రతిసారి ప్లే ఆఫ్ వరకు వెళ్లారు. మారే ఇతర ఫ్రాంచైజ్ కూడా ఈ ఘనతను సాధించలేదు.

అయితే మాజీ భారత్ క్రికెట్ చంద్రశేఖరన్, చెన్నై సూపర్ కింగ్స్ తొలి సీజన్లో జరిగిన ఆక్షన్ లో ధోనిని ఎలా కొన్నారో వివరించారు.

2008 లో ప్రారంభమైన ఐపిఎల్ కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ శ్రీనివాసన్, వీరేంద్ర సెహ్వాగ్ ను కొనాలని ఆదేశించారు అని వీబి చంద్రశేఖరన్ చెప్పారు.

“2008 ఆక్షన్ ముందు శ్రీనివాసన్ నా దగ్గరకు వచ్చి ఎవర్ని కొంటున్నాం అని అడిగారు.” నేను ధోని అని చెప్పను. అప్పుడు అయన ” వీరేంద్ర సెహ్వాగ్ ఎందుకు కాదు?” అని అన్నారు.

“దానికి నేను, “ధోని ఒక మంచి కెప్టెన్, వికెట్ కీపర్ మరియు బాట్స్మన్. అతను ఒంటి చేత్తో మ్యాచ్ ను తిప్పేయగలడు.” అని చెప్పాను”, అని అన్నారు.

తరువాత రోజు బాగా అలోచించి శ్రీనివాసన్ ధోనికి మొగ్గు చూపని చెప్పారు. ఆ ఆక్షన్ లో ధోని అందరికంటే ఎక్కువ డబ్బు కి చెన్నై సూపర్ కింగ్స్ కు వెళ్ళాడు. మరో వైపు వీరేందర్ సెహ్వాగ్ తన సొంత సిటీ ఢిల్లీ కి ప్రాతినిధ్యం వహించాడు.

అయితే ధోని లేకపోయి ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ అంత పెద్ద జట్టు అయ్యేది కాదేమో. చెన్నై ధోని ని కొనుకున్న తరువాత అతను తమిళ్ నాడు చాలా పెద్ద స్టార్ అయ్యాడు. చెన్నై కూడా అతని నాయకత్వం మంచి అడుగులు వేసింది. ఈ ఏడాది తిరిగి ఐపిఎల్ లో పునర్ప్రవేశం చేస్తున్న చెన్నై, మరో సారి పూర్వం చూపిన ఫామ్ ను మరల చూపించేందుకు ఊవిళ్లురుతుంది.

SHARE