ఐపీఎల్ 2018 ఇప్పటి వరకు అనుకున్న రీతిలో రాణించని జట్లలో ఒకటి ముంబై ఇండియన్స్. సాధారణంగా ఐపీఎల్ ను మెల్లగా ప్రారంభించే ముంబై ఇండియన్స్, మరో సారి అలానే చివరిలో అన్ని మ్యాచ్లు గెలవాల్సిన స్థితిలో ఉన్నారు.

ఐతే ఇప్పుడు కోల్ కతా నైట్ రైడర్స్ రూపంలో మరో ముఖ్యమైన మ్యాచ్ లో తలపడనున్నారు ముంబై ఇండియన్స్. కింగ్స్ లెవెన్ పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్ పై కీలక విజయాలు సాధించిన ముంబై, ఈ మ్యాచ్ లో విజయం సాధించడానికి ప్రయత్నించడం ఖాయం.

పిచ్ రిపోర్ట్

ముంబై లోని వానఖేడే స్టేడియం ఎప్పుడు బాటింగ్ కె ఎక్కువ గా అనుకూలిస్తుంది. ఈ సారి కూడా అలానే ఉండే అవకాశాలు మెండు గా ఉన్నాయి.

అయితే గ్రౌండ్ కూడా చాలా చిన్నది అవ్వడంతో పరుగులు గట్టిగా పారడం ఎప్పుడు సాధారణ విషయమే. మరోసారి బ్యాటింగ్కు అనుకూలమైన వికెట్ ఈ మ్యాచ్ లో ఉంటుందని భావించవచ్చు.

హెడ్ టు హెడ్ రికార్డు

ఇప్పటి వరకు ఈ ఇరు జట్లు 21 సార్లు తలపడగా, ముంబై ఇండియన్స్ ఏకంగా 16 విజయాలు సాధించారు. ఐపీఎల్ చరిత్రలో మారె జట్టు ఒకే ప్రత్యర్థి పై ఇన్ని విజయాలు సాధించిన దాఖలాలు లేవు.

అలానే ముంబై ఇండియన్స్ కోల్ కతా నైట్ రైడర్స్ పై వారి చివరి ఆరు మ్యాచ్ లలో విజయం సాధించడం విశేషం. వానఖేడే స్టేడియం విషయానికి వస్తే ఇక్కడ ఈ ఇరు జట్లు ఏడు సార్లు తలపడ్డాయి. ఐతే అందులో కోల్ కతా కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించడం గమనార్హం.

కీలక ఆటగాళ్లు

కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు అత్యంత ముఖ్యమైన ఆటగాడు సునీల్ నరేన్. అతను కేవలం బంతితోనే కాకుండా బ్యాట్తో కూడా ఐపీఎల్ లో విప్లవం సృష్టిస్తున్నాడు. ఐతే ఈ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించాలి అంటే, నరైన్ భాగం ముఖ్యం కానుంది. చెన్నై మిడిల్ ఆర్డర్ వికెట్లు తీయాల్సిన బాధ్యత కూడా ఆతని పైనే ఎక్కువగా ఉంటుంది.

ముంబై ఇండియన్స్ జట్టులో కోల్ కతా జట్టు పై రోహిత్ శర్మ కంటే మంచి రికార్డు ఇంకా ఎవరికీ లేదు. అతను నైట్ రైడర్స్ పై 21 ఇన్నింగ్స్ ఆడగా అందులో 710 పరుగులు చేసాడు. వారి పై ఇప్పటి వరకు ఒక సెంచరీ మరియు 4 అర్ధ సెంచరీలు సాధించాడు రోహిత్ శర్మ. మరో సారి ఈ ముఖ్యమైన మ్యాచ్ లో రోహిత్ శర్మ కీలకం కానున్నాడు.

మ్యాచ్ అంచనా

కోల్ కతా నైట్ రైడర్స్ చక్కటి ఫామ్ కనబరిచినప్పటికీ, ముంబై ఇండియన్స్ ను వారి సొంత గడ్డ పై ఓడించడం అంత సులువైన విషయం కాదు. అందులోను కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ముంబై ఇండియన్స్ ఎప్పుడు అంత చక్కగా ఆడిన దాఖలాలు కూడా లేవు.

ఈ మ్యాచ్ లో మంచి ఫామ్ లో ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు మరో కీలక విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

SHARE