Credits: BCCI

ఐపీఎల్ 2018 లో మెల్లగా ఫామ్ అందుకుంటున్న ముంబై ఇండియన్స్ జట్టుపై కీలక సమరానికి కోల్కతా నైట్ రైడర్స్ సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్లో విజయం ఇరు జట్లకు చాలా కీలకం కానుంది.

ఇకపై ఆడనున్న అన్ని మ్యాచ్లలో విజయం సాధించాల్సి ఉన్న ముంబై ఇండియన్స్, ఇప్పటికే వరుసగా మూడు విజయాలు సాధించి మంచి జట్టు స్ఫూర్తిని చూపించింది.

మరోవైపు కోల్ కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ చేతిలో పరాజయం పాలై మరింత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. వారు ఆడనున్న తదుపరి నాలుగు మ్యాచ్లలో కనీసం మూడు గెలిస్తేనే ప్లే ఆఫ్ దశకు క్వాలిఫై అవుతారు.

పిచ్ రిపోర్ట్

ఈడెన్ గార్డెన్స్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూస్తుంది. రెండో ఇన్నింగ్స్ వచ్చే సమయానికి మారితే మెల్లగా అవ్వడంతో స్కోర్ చేయడం కష్టం అవుతుంది. మరో సారి స్పిన్నర్లులకు అనుకూలమైన పిచ్ ఉండే అవకాశాలు గట్టిగా ఉన్నాయి.

ఈసారి కూడా పిచ్ అదే విధంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఈ ఆటకు వర్షం ఎటువంటి ఆటంకం కలిగించే అవకాశం లేదు. అందుకే ఇరు జట్లలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

టాస్ గెలిస్తే?

సాధారణంగా ఇటీవల కాలంలో టీ 20 క్రికెట్లో టాస్ గెలిస్తే కెప్టెన్లు తొలుత ఫీల్డింగ్ చేసేందుకు ఇష్టపడతారు. అయితే ఈడెన్ గార్డెన్స్ లో మాత్రం తొలుత బ్యాటింగ్ చేస్తేనే జట్టుకు ఆధిపత్యం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి.

ఎందుకంటే రెండో ఇన్నింగ్స్ ప్రారంభం అయ్యేసరికి పిచ్ మరింత మెల్లగా అవ్వడంతో స్పిన్నర్లు మరింత కీలక పాత్ర పోషిస్తారు. దీనితో టాస్ గెలిస్తే దినేష్ కార్తిక్ లేదా రోహిత్ శర్మ, ముందు బ్యాటింగ్ చేసేందుకే ఇష్టపడతారు.

హెడ్ టు హెడ్ రికార్డు

ఇప్పటి వరకు ఈ ఇరు జట్లు 22 సార్లు తలపడగా, ముంబై ఇండియన్స్ ఏకంగా 17 విజయాలు సాధించారు. ఐపీఎల్ చరిత్రలో మారె జట్టు ఒకే ప్రత్యర్థి పై ఇన్ని విజయాలు సాధించిన దాఖలాలు లేవు.

అలానే ముంబై ఇండియన్స్ కోల్ కతా నైట్ రైడర్స్ పై వారి చివరి 7 మ్యాచ్ లలో విజయం సాధించడం విశేషం.

కీలక ఆటగాళ్లు

కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు అత్యంత ముఖ్యమైన ఆటగాడు సునీల్ నరేన్. అతను కేవలం బంతితోనే కాకుండా బ్యాట్తో కూడా ఐపీఎల్ లో విప్లవం సృష్టిస్తున్నాడు. ఐతే ఈ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించాలి అంటే, నరైన్ భాగం ముఖ్యం కానుంది.

ముంబై ఇండియన్స్ పటిష్టమైన మిడిల్ ఆర్డర్ వికెట్లు తీయాల్సిన బాధ్యత కూడా ఆతని పైనే ఎక్కువగా ఉంటుంది.

ముంబై ఇండియన్స్ జట్టులో కోల్ కతా జట్టు పై రోహిత్ శర్మ కంటే మంచి రికార్డు ఇంకా ఎవరికీ లేదు. అతను నైట్ రైడర్స్ పై 22 ఇన్నింగ్స్ ఆడగా అందులో 721 పరుగులు చేసాడు. వారి పై ఇప్పటి వరకు ఒక సెంచరీ మరియు 4 అర్ధ సెంచరీలు సాధించాడు రోహిత్ శర్మ.

మరో సారి ఈ ముఖ్యమైన మ్యాచ్ లో రోహిత్ శర్మ కీలకం కానున్నాడు. అందులోను ఈడెన్ గార్డెన్స్ అతనికి బాగా కలిసి వచ్చిన గ్రౌండ్ కావడంతో మరో సారి రోహిత్ శర్మ భారీ పరుగులు చేసే అవకాశం లేకపోలేదు.

మ్యాచ్ అంచనా

ముంబై ఇండియన్స్ జట్టు కోల్ కతా జట్టుపై సంచలన రికార్డు కలిగి ఉన్నారు. అయితే కోల్ కతా నైట్ రైడర్స్ జట్టును ఈడెన్ గార్డెన్స్ లో ఓడించడం అంత తేలికైన విషయం కాదు.

తమ స్థాయికి తగినట్టు కోల్ కతా నైట్ రైడర్స్ ఆడగలిగితే ఈ మ్యాచ్ లో వారి విజయం తథ్యంగా కనిపిస్తోంది. కానీ ముంబై ఇండియన్స్ పై వారికి ఉన్న పూర్వపు రికార్డు చూస్తుంటే అది అంత తేలికైన పనిగా కనిపించడం లేదు.

SHARE