భారత్ క్రికెటర్ అజింక్య రహానే, ఐపీఎల్ ఫ్రాంచైజ్ రాజస్థాన్ రాయల్స్ తిరిగి ఆడటం తనకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.

“రాయల్స్ కు తిరిగి రావడం చాలా ఆనందంగా ఉంది. నేను ఈ ఐపీఎల్ లో బాగా ఆడాలని నిశ్చయించుకున్నాను. ఈ టీమ్ లో ఒక కుటుంబంలా ఉండే వాళ్ళం, అయితే ఇప్పుడు మళ్ళీ కలిసి ఈ ఫ్రాంచైజ్ కు ఆడటం చాలా సంతోషాన్ని ఇస్తుంది,” అని రహానే అన్నాడు.

రహానేను రైట్ టు మ్యాచ్ కార్డు ఉపయోగించి 4 కోట్లకి రాజస్థాన్ రాయల్స్ జట్టు కొనుకున్న విషయం తెలిసిందే. అయితే రహానేకు తిరిగి సాధించిన రాయల్స్ జట్టు, ఈ సారి మంచి స్టార్ ఆటగాళ్ళని కొనుగోలు చేసారు.

రెండు సంవత్సరాలు ఐపీఎల్ నుండి వెలువడిన రాజస్థాన్ రాయల్స్, ఈ సారి తమ ఉనికిని చాటేందుకు ఊవిళ్లురుతున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ దృష్ట్యా రెండు ఏళ్ళు దూరంగా ఉన్న ఫ్రాంచైజ్, చెన్నై సూపర్ కింగ్స్ తో కలిసి మరల ఈ ఏడాది పునర్ ప్రవేశం చేయనుంది.

ఐతే ఆఖరి సారిలా కాకుండా ఈ సారి ఆ జట్టుకు రాహుల్ ద్రావిడ్ మెంటార్ గా ఉండడు. అతను భారత్ అండర్ 19 మరియు A జట్లకు కోచ్ గా నియామకం అవ్వగా, ఈ సారి ఐపీఎల్ లో ద్రావిడ్ పాల్గొన లేదు.

రాహుల్ ద్రావిడ్ ను రాయల్స్ జట్టు వచ్చే ఐపీఎల్ సీజన్లో మిస్ అవుతుందా అని రహానే ను అడగగా, అతను : “ద్రావిడ్ నాకు రోల్ మోడల్. మొదట్లో మేమిద్దరం కలిసి ఆడం తరువాత అతను నాకు మెంటార్ అయ్యాడు. అతను చెప్పే సలహాలు నాకు మరియు జట్టు ఎంతో దోహద పడ్డాయి. నేను అతని దగ్గర నుండి చాలా నేర్చుకున్నాను.”

Rajasthan Royals captain Rahul Dravid gestures during the IPL Twenty20 cricket match between Pune Warriors India and Rajasthan Royals at The Sahara Stadium in Pune on May 8, 2012. RESTRICTED TO EDITORIAL USE. MOBILE USE WITHIN NEWS PACKAGE. AFP PHOTO/Punit PARANJPE (Photo credit should read PUNIT PARANJPE/AFP/GettyImages)

2011 నుండి 2013 వరకు రాజస్థాన్ రాయల్స్ కు ఆడిన రాహుల్ ద్రావిడ్, తరువాత మెంటార్ గా మంచి పేరు సాధించాడు. ఐతే గత ఏడాది ఢిల్లీ డేర్ డెవిల్స్ కు మెంటార్ గా పని చేసిన ద్రావిడ్, లోధా కమిషన్ సూచనల మేరకు ఈ సారి ఐపీఎల్ లో భాగం కాలేకపోయాడు.

  • SHARE