2018 లో ప్రారంభం కానున్న 11 వ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎడిషన్ లో డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డిఆర్ఎస్) ను అందుబాటు లో తెచ్చేనందుకు బీసీసీఐ ప్రణాళిక చేస్తునట్టు తెలుస్తుంది.

అయితే ఇన్నాళ్లు డిఆర్ఎస్ కు ప్రతికూలంగా ఉన్న బీసీసీఐ, ఇటీవలే కాలం కాస్త సానుకూలత చూపించిన విషయం తెలిసిందే. ఇది వరకు చాలా సార్లు ఈ టెక్నాలజీ పై విమర్శలు చేసిన బీసీసీఐ, ఐపీఎల్ లో అమలు చేయడం అందరిని ఆశ్చర్య పరచనుంది.

MUMBAI, INDIA – JUNE 22, 2008: Indian cricket team’s captain Mahendra Singh Dhoni and coach Gary Kirsten leave after a news conference in Mumbai June 22, 2008. The Indian cricket team leaves tonight to play sixnation Asia Cup tournament in Pakistan, which begins June 24. Teams playing in the Asia Cup are Pakistan, India, Sri Lanka, Bangladesh, Hong Kong and United Arab. (Photo by Satish Bate/Hindustan Times via Getty Images)

ఇదివరకు డిఆర్ఎస్ పై కామెంట్స్ చేసిన మాజి భారత్ కెప్టెన్ ఏం ఎస్ ధోని, ఈ టెక్నాలజీ 100 % కరెక్ట్ గా లేదని చెప్పాడు. ఐతే గత ఏడాది కాలంలో డిఆర్ఎస్ ను వీరివి గా వాడిన బీసీసీఐ, ఐపీఎల్ లో కూడా ఈ టెక్నాలజీ ని టెస్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

ప్రపంచం లోనే అత్యంత ధనిక బోర్డు అయినా బీసీసీఐ, ఐపీఎల్ లో ఈ టెక్నాలజీ ని వాడితే ఈ సీజన్ పై అభిమానుల్లో మరింత అంచనాలు పెరుగుతాయి అని చెప్పొచ్చు. గత ఏడాది అంతర్జాతీయ టీ 20 మ్యాచ్ లలో డిఆర్ఎస్ వాడుకునేందుకు ఐసీసీ అనుమతి ఇచ్చిన విషయం అందరికి తెలిసినదే.

ఐతే 2020 లో జరిగే తదుపరి టీ 20 ప్రపంచ కప్ లో డిఆర్ఎస్ టెక్నాలజీ పొట్టి ప్రపంచ కప్ లో అరంగ్రేటం చేయనుంది. ఐతే ఐపీఎల్ లో ఈ టెక్నాలజీ ను వాడటం భారత్ కు భవిష్యత్తు లో బాగా ఉపయోగ పడుతుందని బోర్డు భావిస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ ఏడాది ఐపీఎల్ ఏప్రిల్ 7 న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుండగా, ఫైనల్ మ్యాచ్ మే 27 న వానఖేడే స్టేడియం లో జరగనుంది.

SHARE