గత 7 సంవత్సరాలుగా కోల్ కతా నైట్ రైడర్స్ కు కెప్టెన్ గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్, ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఢిల్లీ లో జరిగిన ఒక ప్రత్యేక ఈవెంట్ లో ఆ ఫ్రాంచైజ్ యాజమాన్యం ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించింది. గౌతమ్ గంభీర్ తన ఐపీఎల్ కెరీర్ లో తొలి మూడు సీజన్ లు ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ఆడిన విషయం తెలిసిందే. అయితే మూడో సీజన్ తరువాత జరిగిన ఆక్షన్ లో గంభీర్ రికార్డు 11.04 కోట్లు పెట్టి అప్పట్లో నైట్ రైడర్స్ కొనుక్కున్నారు.

ఐతే తాను పుట్టిన సిటీ ఢిల్లీ కు ఆడాలని గంభీర్ ముందే నిర్ణయించుకున్నట్టు నైట్ రైడర్స్ యాజమాన్యం మీడియాకు ఆక్షన్ అయినా తరువాత చెప్పింది. కెప్టెన్ గా మంచి పేరు ప్రఖ్యాతులు సాధించిన గంభీర్, 2012 మరియు 2014 లో కోల్ కతా కు రెండు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచాడు.

ఢిల్లీ 2.8 కోట్లు పెట్టి ఈ ఏడాది గౌతమ్ గంభీర్ ను కొనుక్కున్న విషయం అందరికి తెలిసినదే. అయితే ఆ ధరకు అతని సాధించడం చాలా మంచి విషయమని చెప్పాలి. ఐపీఎల్ లో అగ్ర బాట్స్మెన్ లలో ఒక్కడైనా గంభీర్, 148 మ్యాచులలో 4132 పరుగులు చేసాడు.

కెప్టెన్ గా ప్రకటించిన తరువాత గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ: “ఢిల్లీ డేర్ డెవిల్స్ కు మరల కెప్టెన్ గా ఎంపిక అవ్వడం భారీ గౌరవం. మళ్ళీ ఇలా కెప్టెన్ అవ్వడం తో నాకు ఇష్టమైన ఆటకు నా నగరికి ఎంతో కాంత తిరిగి ఇవ్వాలి అని భావిస్తున్న.

“ఢిల్లీ డేర్ డెవిల్స్ లో చాలా మంచి ఆటగాళ్లు ఉన్నారు. ఐతే మా జట్టులో ఉన్న యువ క్రికెటర్ల మంచి టాలెంట్ కలిగిన వారు. అయితే ప్రదర్శనలు నిలకడ చేయాలి. రికీ పాంటింగ్ తో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది.”

SHARE