ఐపీఎల్ 2018 లో అంచనాలకు తగిన రాణించలేకపోయినా ఒకే ఒక జట్టు ఢిల్లీ డేర్ డెవిల్స్. వారు ఆడిన 8 మ్యాచ్ లలో కేవలం 2 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉన్నారు. అయితే ప్లే ఆఫ్ దశకు చేరాలంటే వారు మిగిలిన ఆరు మ్యాచ్లు గెలిస్తే, ప్లే ఆఫ్ దశకు క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అయితే వారు బుధవారం రాజస్థాన్ రాయల్స్ తో ఫిరోజ్ షా కోట్లాలో ముఖ్యమైన మ్యాచ్లో తలపడనున్నారు. యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ఇప్పటి వరకు కెప్టెన్గా వ్యవహరించిన రెండు మ్యాచ్ల్లో ఒక విజయం సాధించాడు. అయితే ఢిల్లీ రాజస్థాన్ చెట్టుపై ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

పిచ్ రిపోర్టు

Feroz Shah Kotla

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లాలో జరగనున్న ఈ మ్యాచ్ లో పిచ్ స్పిన్నర్లకు బాగా అనుకూలించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే స్పిన్నర్లు అనుకూలించనప్పటికీ గ్రౌండ్లో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తుంది.

ఈ స్టేడియంలో జరిగిన గత రెండు మ్యాచ్లలో బ్యాట్స్మన్ అధికంగా పరుగులు చేయడం విశేషం. ఈ సారి కూడా అలానే బ్యాట్స్మన్కు కాస్త ఎక్కువ అనుకూలించే అవకాశాలు ఉన్నాయి.

టాస్ గెలిస్తే?

టాస్ గెలిచిన కెప్టెన్ తొలుత బ్యాటింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా ఈ మధ్యకాలంలో టాస్ గెలిస్తే తొలుత పాలుచేస్తున్న ప్పటికీ ఈ స్టేడియంలో పిచ్ రెండవ ఇన్నింగ్స్లో స్పిన్నర్లకు మరింత సహకారం అందిస్తుంది దీనితో తొలి బ్యాటింగ్ చేస్తే మంచి స్కోరు సాధించి అపోజిషన్ జట్టును ఒత్తిడికి గురి చేయవచ్చు.

హెడ్ టు హెడ్ రికార్డ్

ఇప్పటివరకు ఈ ఇరు జట్లు 17 సార్లు తలపడగా, రాజస్థాన్ రాయల్స్ పదకొండు విజయాలు సాధించింది. మరోవైపు ఢిల్లీ డేర్ మిల్స్ ఆరు విజయాలతో సరిపెట్టుకున్నారు.

అయితే ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో వీరి రికార్డు సమంగా ఉంది. ఇరు జట్లు మూడు విజయాలతో సమానంగా ఉన్నాయి.

ముఖ్యమైన ఆటగాళ్లు

ఢిల్లీ డేర్డెవిల్స్ వారికి స్థాయికి తగిన ప్రదర్శనలు చేయకపోయినప్పటికీ వారి జట్టులో చాలా మంచి ఆటగాళ్లు ఉన్నారు. అయితే ఇటీవలే మంచి ఫారం కనబరుస్తున్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరోసారి జట్టుకు కీలకం కానున్నాడు.

అతను ఒంటిచేత్తో మ్యాచ్ను తిప్పగలిగే సత్తా ఉన్నవాడు. ముఖ్యంగా అతను డెత్ ఓవర్లలో సంచలమైన హిట్టింగ్ చేయగలిగే ప్రతిభ కలిగి ఉన్నాడు.

రాజస్థాన్ రాయల్స్ జట్టుకు అజింక్య రహానే మరోసారి కీలక పాత్ర పోషించనున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో వారు ఆడిన చివరి ఆటలో రహానే జట్టును ముందుండి నడిపించాడు. అయినప్పటికీ వేరే బ్యాట్స్మన్ నుండి ఎటువంటి సహకారం లభించకపోవడంతో వారు మరో కీలక మ్యాచ్లో పరాజయం చవిచూశారు. ఢిల్లీపై జరగనున్న మ్యాచ్లో అజింక్య రహానే మరోసారి బ్యాటింగ్లో కీలకం కానున్నాడు.

మ్యాచ్ అంచనా

రాజస్థాన్ రాయల్స్ జట్టులో చాలామంది మంచి ఆటగాళ్లు ఉన్నప్పటికీ వారు ఫామ్ లేక సతమతమవుతున్నారు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు మంచి ప్రదర్శనలు చూపించింది.

తమ స్థాయికి తగినట్టు ఢిల్లీ డేర్ డెవిల్ చాటితే వారికి విజయం చాలా సానుకూలంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

SHARE