Delhi Daredevils players arrive on the ground for the start of the match nine of the Vivo Indian Premier League 2018 (IPL 2018) between the Mumbai Indians and the Delhi Daredevils held at the Wankhede Stadium in Mumbai on the 14th April 2018. Photo by: Vipin Pawar / IPL/ SPORTZPICS

ఐపీఎల్ 2018 లో అంచనాలకు తగినట్టు రాణించలేక పోయినా ఒకే ఒక్క జట్టు ఢిల్లీ డేర్ డెవిల్స్. వారు ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్ లలో కేవలం ఒక్క విజయం సాధించి, పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్నారు.

అయితే ఐపీఎల్ ప్రారంభం అయ్యే సమయంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు ఈసారి కనీసం ప్లే ఆఫ్ దశకు చేరుతుందని చాలామంది అభిప్రాయపడ్డారు. నీరసమైన ఫలితాలు సాధించడంతో కెప్టెన్ గౌతమ్ గంభీర్ ను కూడా జట్టు యాజమాన్యం కెప్టెన్సీ నుండి తొలగించింది. యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ను కొత్త కెప్టెన్గా ప్రకటించిన ఢిల్లీ, శుక్రవారం కోల్ కతా నైట్ రైడర్స్ పై తలపడనున్నారు.

పిచ్ రిపోర్టు

Feroz Shah Kotla

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల లో జరగనున్న ఈ మ్యాచ్ లో పిచ్ స్పిన్నర్లకు బాగా అనుకూలించింది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో సునీల్ నరైన్, పియూష్ చావ్లా మరియు కుల్దీప్ యాదవ్ లాంటి మంచి స్పిన్నర్లు ఉండటంతో వారికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు.

టాస్ గెలిస్తే?

టాస్ గెలిచిన కెప్టెన్ తొలుత బ్యాటింగ్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సాధారణంగా ఈ మధ్యకాలంలో టాస్ గెలిస్తే తొలుత బౌలింగ్ చేస్తున్నప్పటికీ ఈ గ్రౌండ్లోని పిచ్ రెండవ ఇన్నింగ్స్లో స్పిన్నర్లకు మరింత సహకారం అందించే అవకాశం ఉండటంతో తొలుత బ్యాటింగ్ చేసి మంచి స్కోరు సాధించడం కీలకం.

ఇరు జట్లలో మంచి స్పిన్నర్లు ఉండటంతో టాస్ ఈ మ్యాచ్ లో కీలకం కానుంది.

హెడ్ టు హెడ్ రికార్డు

ఇప్పటి వరకు ఈ ఇరు జట్లు 20 సార్లు తలపడగా, కోల్ కతా నైట్ రైడర్స్ ఏకంగా 13 విజయాలు సాధించింది. మరోవైపు ఢిల్లీ డేర్ డెవిల్స్ ఏడు విజయాలతో సరిపెట్టుకుంది.

గత ఎనిమిది మ్యాచ్ల్లో కోల్ కతా నైట్ రైడర్స్ ఏడు మ్యాచ్లు గెలవడం కొసమెరుపు.

ముఖ్యమైన ఆటగాళ్లు

ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు వారి స్థాయికి తగిన ప్రదర్శనలు ఇంకా చెయ్యని విషయం మనందరికీ తెలిసిందే. అయితే వారి బౌలింగ్ కంటే బ్యాటింగ్ మరింత బలహీనంగా ఉంది. మిడిల్ ఆర్డర్లో గ్లేన్ మాక్స్వెల్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోవడం జట్టుకు చాలా ఇబ్బందిగా మారింది.

అయితే తనదైన రోజు ఒంటిచేత్తో మ్యాచ్ను తిప్పగలిగే సత్తా ఉన్న మ్యాక్స్ వెల్, ఈ మ్యాచ్లో కీలకం కానున్నాడు అతను సరిగ్గా ఆడితే మ్యాచ్ ఢిల్లీ కైవసం చేసుకోవడం అంత కష్టమైన పని ఏమీ కాదు.

మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. అయితే మరోసారి వెస్ట్ ఇండీస్ ఆటగాడు సునీల్ నరైన్ కీలకం కానున్నాడు. ఢిల్లీ పిచ్ స్పిన్నర్లకు బాగా అనుకూలించడంతో అతని ప్రభావం చాలా ముఖ్యం కానుంది. అతని ప్రదర్శన నైట్ రైడర్స్ జట్టుకు ఈ కీలకమైన మ్యాచ్లో నేతృత్వంలో చాలా అవసరం.

మ్యాచ్ అంచనా

ఢిల్లీ డేర్ డెవిల్స్ తమ తొలి ఆరు మ్యాచ్లలో కేవలం 1 విజయం సాధించినప్పటికీ, తమదైన రోజు ఎటువంటి జట్టునైనా ఓడించగలిగే సత్తా ఉన్న బృందం. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో ఆడనున్న ఈ యువ జట్టు, డూ ఆర్ డై మ్యాచ్ లో గెలిచే అవకాశం బాగానే ఉంది.

అయితే కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో ఆండ్రీ రసెల్ ఆడతాడా లేదా అన్న విషయం ఎవరికీ తెలియదు.