Kings Xi Punjab win during match thirty eight of the Vivo Indian Premier League 2018 (IPL 2018) between the Kings XI Punjab and the Rajasthan Royals held at the Holkar Cricket Stadium, Indore on the 6th May 2018. Photo by: Deepak Malik /SPORTZPICS for BCCI

ఐపీఎల్ 2018 తొలి భాగంలో అత్యద్భుత ఫామ్ కనబరిచిన కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు, వారు వాడిన గత ఏడు మ్యాచ్లలో 6 ఓటములు సాధించారు. దీనితో చివరి లీగ్ మ్యాచ్లో చెన్నై పై కచ్చితంగా విజయం సాధించాల్సిన అవసరం ఏర్పడింది పంజాబ్ జట్టుకు.

మరోవైపు ఇప్పటికే ప్లే ఆఫ్ దశకు చేరుకున్నా చెన్నై సూపర్ కింగ్స్, ఈ మ్యాచ్ లో భారీ పరాజయం ఎదుర్కోకపోతే తొలి రెండు స్థానాల్లో ఉండి మొదటి క్వాలిఫయర్లో తలపడుతుంది.

పిచ్ రిపోర్టు

పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్లో పిచ్ చాలా కీలకం కానుంది. భారత్ దేశంలోనే అత్యుత్తమ బ్యాటింగ్ వికెట్లలో ఒకటైన ఈ పిచ్ మరోసారి బ్యాటింగ్కు బాగా అనుకూలించే అవకాశం ఉంది.

అయితే రెండవ ఇన్నింగ్స్ లో కాస్త మెల్లగా ప్రవర్తిస్తున్న ఈ పిచ్పై బ్యాట్స్మెన్ తమ అనుభవాన్ని ఉపయోగించి ఆడితే మంచి పరుగులను సాధిస్తారు.

టాస్ గెలిస్తే?

టాస్ గెలిచిన కాప్టన్ తొలుత  చేయడానికి కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ గ్రౌండ్లో సాధారణంగా తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు ఎక్కువగా గెలుస్తూ ఉండటంతో, తొలుత బౌలింగ్ చేయడానికి కెప్టెన్లు బాగా మక్కువ చూపుతాయి.

ఐతే రెండో ఇన్నింగ్స్ లో పిచ్ కొంచెం మెల్లగా ఉండటం వలన తొలుత బాటింగ్ చేస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.

హెడ్ టు హెడ్ రికార్డు

ఇప్పటి వరకు ఇరుజట్లు ఐపీఎల్ చరిత్రలో 18 సార్లు తలపడగా, చెన్నై సూపర్ కింగ్స్ 10 విజయాలు సాధించింది. మరోవైపు కింగ్స్ లవన్ పంజా బేడు విజయాలు సాధించగా, ఒక మ్యాచ్ మాత్రం టైగా ముగిసింది.

అయితే పుణెలో మాత్రం పంజాబ్ జట్టు రికార్డు చాలా అధ్వానంగా ఉంది. వారు ఈ గ్రౌండ్ లాడిన ఆరు మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక్క విజయం సాధించారు.

కీలక ఆటగాళ్లు

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సంచలనమైన ఫాం కనబరచడానికి ముఖ్య కారణం అంబటి రాయుడు. ఒకవైపు టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్ మిశ్రమంగా రాణిస్తున్నప్పటికీ అంబటి రాయుడు మాత్రం ఒకే రీతిలో జట్టుకు అవసరమైన కీలక పరుగులు సాధిస్తూ వారి సీజన్లో ఇప్పటివరకు కీలక పాత్ర పోషించాడు.

అయితే ప్లే ఆఫ్ మ్యాచ్ లు ఆడే ముందు విజయం సాధించడం చెన్నై జట్టుకు చాలా ముఖ్యం. దీనితో రాయుడు మరో సారి కీలక పాత్ర పోషించడం చాలా కీలకం.

(Credits: BCCI)

కింగ్స్ XI పంజాబ్ జట్టుకు మరో సారి ఓపెనర్లు కే ఎల్ రాహుల్, క్రిస్ గేల్ కీలకం కానున్నారు. అయితే కే ఎల్ రాహుల్ మాత్రం భయంకరమైన ఫామ్ లో ఉన్నాడు. ఈ ఇరువురు ఆడే తీరుపైనే పంజాబ్ జట్టు విజయావకాశాలు ఆదారపడి ఉంటాయి. ఒకవేళ ఈ ద్వయం సరిగ్గా రాణించకపోతే సరైన ఫామ్ లో ఉన్న బాట్స్మన్ పంజాబ్ లో లేరు.

మ్యాచ్ అంచనా

చెన్నై సూపర్ కింగ్స్ జట్టును వారి సొంత గ్రౌండ్లో ఓడించడం అంత తేలికైన విషయం కాదు. అయితే సాయంత్రం జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తడబడితే, కింగ్స్ జట్టు కేవలం విజయం సాధిస్తే ప్లే ఆఫ్ కు చేరుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

క్రిస్ గేల్, కేఎల్ రాహుల్ తమ స్థాయికి తగిన ప్రదర్శనలు చేస్తే చెన్నై బౌలర్లకు వారిని ఆపడం చాలా కష్టం కానుంది.

SHARE