Rashid Khan of Sunrisers Hyderabad celebrates wicket of Faf Du Plessis of Chennai Super Kings during match twenty of the Vivo Indian Premier League 2018 (IPL 2018) between the Sunrisers Hyderabad and the Chennai Super Kings held at the Rajiv Gandhi International Cricket Stadium in Hyderabad on the 22nd April 2018. Photo by: Prashant Bhoot / IPL/ SPORTZPICS

2018 ఐపీఎల్ సీజన్లో కీలక మ్యాచ్ కారులో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కింగ్స్ లెవెన్ పంజాబ్పై ముఖ్యమైన విజయం సాధించింది.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రవిచంద్రన్ అశ్విన్ నిర్ణయం సరైనదేనంటూ నిరూపిస్తూ పంజాబ్ బౌలర్లు చెలరేగిపోయారు. పవర్ప్లే ఓవర్లలో సన్ రైజర్స్ టాప్ ఆర్డర్ వికెట్లను తీసుకుని మ్యాచ్లో పై చేయి సాధించారు. వివాహం భారత పేసర్ అంకిత్ రాజ్ పుత్ పవర్ప్లే ఓవర్లలో ఏకంగా మూడు వికెట్లు తీసుకుని అలరించాడు.

అయితే తర్వాత భారత బ్యాట్స్మన్ మనీష్ పాండే మరియు షకీబ్ అల్ హసన్ చక్కటి భాగస్వామ్యం తో సన్ రైజర్స్ కు కీలక పరుగులు సాధించారు. నాలుగో వికెట్కు వీరు ఇరువురు యాభై పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇన్నింగ్స్ను కుదుట పరిచారు. ఇన్నింగ్స్ జరుగుతున్న క్రమంలో మనీష్ పాండే చక్కగా రాణిస్తూ తన అర్ధ శతకం సాధించాడు. అయితే అతను ఆడిన ఇన్నింగ్స్ లో మూడు సార్లు పంజాబ్ ఫీల్డర్లు క్యాచ్ వదిలేయడం గమనార్హం.

చివరిలో వెటరన్ ఆల్రౌండర్ యూసఫ్ పఠాన్ కూడా విలువైన పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో అంకిత్ రాజ్పుత్  ఐదు వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు.

Photo Credit: IPL.

133 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన కింగ్స్లెవెన్ పంజాబ్ జట్టుకు ఓపెనర్లు లోకేష్ రాహుల్ మరియు క్రిస్ గేల్ చక్కటి ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ ఇరువురు వెనువెంటనే ఔట్ అయ్యారు. తరువాత వచ్చిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ ఎవరు సరైన నిలకడ చూపలేకపోయారు.

మిడిల్ ఆర్డర్లో ఎవరూ 13 పరుగులు మించి చేయలేకపోగా బౌలర్లు కూడా పెద్దగా పంజాబ్కు పరుగులు రాబట్టలేకపోయారు. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు చక్కటి లైన్ లో బౌలింగ్ చేయడంతో పరుగులు కట్టడి చేసి మంచి ఒత్తిడిని సృష్టించారు.

దీనితో మంచి బ్యాటింగ్ కలిగి ఉన్న కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు కేవలం 119 పరుగులకే ఆల్ అవుట్ అయింది. తద్వారా హైదరాబాద్ జట్టు 13 పరుగులతో మంచి విజయం సాధించింది. హైదరాబాద్ బౌలర్లు అందరూ సమష్టిగా కృషి చేయగా, రషీద్ ఖాన్ మూడు వికెట్లు తీసి అలరించాడు.