వెన్నుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ ఈ ఏడాది ఐపిఎల్ సీజన్ నుండి దూరం అవుతున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.

24 సంవత్సరాలు కలిగిన ప్యాట్ కమిన్స్ ఇటీవల సౌతాఫ్రికాపై జరిగిన టెస్టు సిరీస్‌లో సంచలన ఫామ్‌ను కనబరిచాడు. అతన్ని జనవరిలో జరిగిన ఐపీఎల్ ఆక్షన్ లో ముంబై ఇండియన్స్ జట్టు 5.4 కోట్లకు కొనుగోలు చేసింది.

అయితే తన కెరీర్ మొత్తం గాయాలతో సతమతమైన ప్యాట్ కమిన్స్ ఇటీవలే కాలంలో తరచుగా ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గత ఏడాది ఇండియా పర్యటనలో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన కమిన్స్ వరుసగా 13 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. అన్ని ఫార్మెట్లలో ముఖ్యమైన బౌలర్ కమిన్స్ కావడంతో అతనిపై గత ఏడాదిగా భారం గట్టిగానే పడింది.

అయితే వెన్ను సమస్యలు ప్యాట్ కమిన్స్ కు కొత్త ఏమీ కాదు. అతను గత ఆరు సంవత్సరాలుగా ఏదో ఒక గాయానికి పాలవుతూనే ఉన్నాడు. అయితే ఫిట్‌గా ఉన్న కమిన్స్ ప్రపంచంలోనే అత్యంత భీకరమైన బౌలర్లలో ఒకడు. ఇటీవలే జరిగిన సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ లో సంచలన ఫామ్‌ను కనబరచిన కమిన్స్, ప్రపంచ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో మొదటి సారి టాప్ 10 కు చేరాడు.

అయితే అతని గాయం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కు పెద్ద దెబ్బే. తో తొలి మేచ్ లో చెన్నై సూపర్ కింగ్స్‌పై దారుణంగా విఫలమైన ముంబయి బౌలింగ్, ఇప్పుడు కమిన్స్ లేకపోవటంతో ఎలా ప్రదర్శిస్తారు చూడాలి. అయితే ముంబయి ఇండియన్స్ జట్టుకు బౌలింగ్ మెంటర్‌గా వ్యవహరిస్తున్న శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగా మరోసారి ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశాలు ఉండగానే ఉన్నాయి.

ఈ ఏడాది ఐపిఎల్‌లో ఇప్పటికే చాలా మంది స్టార్ ఆటగాళ్లు గాయాలతో టోర్నమెంట్ నుండి వైదొలిగారు. ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్, సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడా ఇప్పటికే టోర్నమెంట్ నుండి వైదొలగిన విషయం అందరికీ తెలిసినదే.

SHARE