ఐపీఎల్ 2018 లో తమ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేన్ విలియమ్సన్, తన జట్టును ముందుండి నడిపించాడు.

తొలి ఓవర్ లోనే బిబిఎల్ సంచలనం డార్సీ షార్ట్ ను రనౌట్ చేసి జట్టుకు శుభారంభాన్ని అందించాడు. దాని తరువాత బౌలర్లు నిలకడగా మధ్య ఓవర్లలో వికెట్లు తీయటంతో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మన్ ఎటువంటి విధంగా పరుగులు చేయలేకపోయారు. ఐపీఎల్ చరిత్రలో కేవలం నాలుగోసారి ఒక ఇన్నింగ్స్ లో సిక్స్ ఇవ్వని జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్డు సాధించింది.

రాజస్థాన్ బ్యాట్స్ మన్ లో కేవలం సంజు శాంసన్ మాత్రమే పోరాడటం చూపించగా, మిగిలిన వారు ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. వారి నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది.

సన్‌రైజర్స్ బౌలర్లలో షకీబల్ హసన్ మరియు సిద్ధార్థ్ కౌల్ రెండు వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్, బిల్లీ స్టాన్లేక్, రషీద్ ఖాన్ ఒక్కో వికెట్ తీశారు.

కేవలం 126 పరుగులు చేదించడానికి బ్యాటింగ్ కు వచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు, ఆదిలోనే వృద్ధిమాన్ సాహా వికెట్‌ను కోల్పోయింది. అయితే మూడవ నెంబర్లో వచ్చిన నూతన కెప్టెన్ కేన్ విలియమ్సన్ , ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి మరో మరో వికెట్ పోకుండా అజేయమైన 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి కేవలం 15.5 ఓవర్లలో టార్గెట్ ను ఛేదించారు.

కేన్ విలియమ్సన్ నిలకడగా ఆడగా, శిఖర్ ధావన్ మాత్రం తన సంచలన ఫామ్‌ను మరలా కనబరిచాడు. కేవలం 57 బంతుల్లో 77 పరుగులు చేసిన ధావన్, 13 ఫోర్లు మరియు ఒక్క సిక్స్ సాధించాడు. ఈ విజయంతో అన్ని జట్లు తొలి మేచ్ ఆడిన తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ మంచి రన్ రేట్‌తో టేబుల్ లో తొలి స్థానం దక్కించుకుంది.

రాజస్థాన్ రాయల్స్ తమ తదుపరి మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తో తలపడనుండగా, గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మరోసారి సొంతగడ్డపై ముంబయి ఇండియన్స్‌తో తలపడనుంది.

SHARE