వచ్చే నెల ప్రారంభం కానున్న ఐపీఎల్ 11 వ సీజన్ కు సన్ రైజర్స్ హైదరాబాద్, ఇంగ్లాండ్ ఓపెనర్ అలెక్స్ హెల్స్ తో ఒప్పందం కుర్దూర్చుకున్నట్టు తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులకు తెలియజెసారు.

కేప్ టౌన్ లో జరిగిన బాల్ టాంపరింగ్ వివాదం కారణం గా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై క్రికెట్ ఆస్ట్రేలియా 12 నెలల పాటు వేటు వేసిన విషయం తెలిసినదే. అయితే తరువాత బీసీసీఐ కూడా అదే నిర్ణయాన్ని అమలు పరచడం తో సన్ రైజర్స్ జట్టు ఒక ముఖ్యమైన బాట్స్మన్ మరియు కెప్టెన్ ను కోల్పోయింది.

Sunrisers Hyderabad captian David Warner hit the six during the final of the Vivo IPL 2016 ( Indian Premier League ) between The Royal Challengers Bangalore and the Sunrisers Hyderabad held at The M. Chinnaswamy Stadium in Bangalore, India, on the 29th May 2016
Photo by Deepak Malik / IPL/ SPORTZPICS

సన్ రైజర్స్ హైదరాబాద్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన వార్నర్, ఐపీఎల్ లో కూడా తనకంటూ ఒక పేరు సాధించాడు. అత్యధిక అర్థ సెంచరీలు, పరుగులు చేసిన విదేశీ ఆటగాడు అతనే.

అయితే ఆఖరి నిమిషంలో వార్నర్ ను కోల్పోవడంతో, సన్ రైజర్స్ యాజమాన్యం తొలుత శ్రీలంక ఆటగాడు కుశాల్ పెరెరా ను సంప్రదించినట్టు తెలుస్తుంది. అయితే అతను శ్రీలంక టెస్ట్ జట్టులో స్థానం సంపాదించడానికి దేశవాళీ క్రికెట్ పై ద్రుష్టి సారించడంతో, సన్ రైజర్స్ యాజమాన్యం ఇంగ్లాండ్ బాట్స్మన్ హెల్స్ ను కొనుక్కున్నారు.

ప్రపంచంలో ఉన్న విద్వాంసాకార బాట్స్మన్ లో ఒకరి గా పేరు తెచ్చుకున్న హెల్స్, సన్ రైజర్స్ బాటింగ్ లో మంచి చేర్పు. అతను తనదైన రోజు ఒంటి చేత్తో మ్యాచ్ ను గెలిపించగలిగే సత్తా కలిగిన వాడు.

ఐతే డేవిడ్ వార్నర్ లెవెల్ లో ఆడటం కష్టమైనప్పటికీ, ధావన్ తో కలిసి మంచి భాగస్వామ్యాలు చేయగలడు. ఇప్పటికే డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ ను కేన్ విలియం సన్ ను ప్రకటించిన సన్ రైజర్స్ ఫ్రాంచైజ్, భారత్ అగ్ర పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ను వైస్ కెప్టెన్ గా కూడా ప్రకటించారు.

SHARE