క్రికెట్ చరిత్రనే మార్చేసిన ఒకే ఒక్క దేశవాళీ టోర్నమెంట్ ఐపీఎల్. 2008 లో ప్రారంభమైన ఈ ధనిక లీగ్, ఆటగాళ్లకు ఆర్థిక భద్రతను కలిపించింది. భారత్ ఉపఖండంలో కూడా క్రికెట్ కు సరికొత్త క్రేజ్ తీసుకొచ్చి పెట్టింది ఐపీఎల్.

ఒక ఐపీఎల్ సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లకు ఇచ్చే టోపీను పర్పిల్ కాప్ అంటాం. ఐపీఎల్ 11 వ ఎడిషన్ ప్రారంభం కాన్నుండటంతో ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు పర్పిల్ కాప్ గెలుచుకున్న వారు ఎవరో చూద్దాం.

2008- సోహైల్ తన్వీర్ 

ఐపీఎల్ ప్రారంభమైన తొలి సీజన్ లో తన అద్భుతమైన స్వింగ్ బౌలింగ్ ఉరూతలూగించాడు పాకిస్తాన్ స్పీడ్ బౌలర్, సోహైల్ తన్వీర్. కేవలం 11 మ్యాచులు ఆడిన తన్వీర్, 22 వికెట్లు తీసి అందరిని అబ్బురపరిచారు.

2009- ఆర్ పి సింగ్ 

2000 దశకం చివరిలో భారత్ కు కీలక బౌలర్ గా మారిన ఆర్ పి సింగ్, తన మాయాజాలాన్ని రెండో సీజన్ లో చూపించాడు. డెక్కన్ ఛార్జర్స్ ఆడిన ఆర్ పి సింగ్, దక్షిణ ఆఫ్రికా లో 16 మ్యాచ్లలో 23 వికెట్లు తీసి పర్పిల్ కాప్ సొంతం చేసుకున్నాడు.

2010- ప్రగ్యాన్ ఓఝా

డెక్కన్ ఛార్జర్స్ కు 2010 ఐపీఎల్ సీజన్ లో ఓఝా అద్భుతంగా ఆడాడు. అతను 16 మ్యాచ్ లలో 21 వికెట్లు తీస్కుని పర్పిల్ కాప్ దక్కించుకున్నాడు. ఐతే ఇప్పటి వరకు పర్పిల్ కాప్ గెలుచుకున్న ఒకే ఒక్క స్పిన్నర్ గా ఇప్పటికి ఉన్నాడు, ఓఝా.

2011- లసిత్ మలింగా 

ఐపీఎల్ రెండో సీజన్ లో తొలి సారి దక్షిణ ఆఫ్రికాలో మొదటి సారి ముంబై ఇండియన్స్ కు ఆడిన లసిత్ మలింగా, ప్రపంచంలోనే అత్యుత్తమ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ గా పేరు సాధించాడు.

అతను 2011 సీజన్ లో కేవలం 16 మ్యాచ్లలో 28 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు.

2012- మోర్నీ మోర్కెల్ 

2012 లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ప్రాతినిధ్యం వహించిన మోర్నీ మోర్కెల్, తన కెరీర్ లోనే అత్యుత్తమ ఐపీఎల్ సీజన్ ఆడాడు. అతను 16 మ్యాచ్ లలో 25 వికెట్లు తీసి, పర్పిల్ కాప్ గెలుచుకున్నాడు.

2013- డ్వైన్ బ్రేవో

తన ఐపీఎల్ కెరీర్ ను ముంబై ఇండియన్స్ తో ప్రారంభించిన డ్వైన్ బ్రేవో, చెన్నై సూపర్ కింగ్స్ లో ఆడటం మొదలు పెట్టాక టీ 20 క్రికెట్లోనే అత్యుత్తమ డెత్ బౌలర్లలో ఒకడిగా మారాడు.

2013 సీజన్ లో ఏకంగా 32 వికెట్లు తీసి ఒకే సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు.

2014- మోహిత్ శర్మ 

2014 లో తొలి సారి ఐపీఎల్ లో ఆడిన మోహిత్ శర్మ, లీగ్ లో సంచలన హిట్ అయ్యాడు. అతను తన తొలి సీజన్ లోనే పర్పిల్ కాప్ గెలవడం విశేషం.

తన తొలి సీజన్ లో 16 మ్యాచ్ లు ఆడిన మోహిత్, 23 వికెట్లు తీసి ఆ సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అయ్యాడు.

2015- డ్వైన్ బ్రేవో

ఐపీఎల్ చరిత్రలోనే రెండు పర్పిల్ కాప్ లు గెలుచుకున్న తొలి ఆటగాడు బ్రేవో. చెన్నై సూపర్ కింగ్స్ విజయాలలో కీలక పాత్ర పోషించిన బ్రేవో, 2015 లో కూడా మరో సారి తన భూమిక పోషించాడు. అతను 16 మ్యాచ్ లలో 26 వికెట్లు తీసాడు.

2016- భువనేశ్వర్ కుమార్

భారత్ క్రికెట్లో ముఖ్యమైన బౌలర్ గా మారిన భువనేశ్వర్ కుమార్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక సభ్యుడు. అతను ఐపీఎల్ ద్వారానే తన బౌలింగ్ లో చాలా మెళుకువలు నేర్చుకున్నాడు. 2016 లో జరిగిన ఐపీఎల్ సీజన్ లో అతను 23 వికెట్లు తీసి సన్ రైజర్స్ కు వారి తొలి ఐపీఎల్ ట్రోఫీ అందించాడు.

2017- భువనేశ్వర్ కుమార్ 

ఐపీఎల్ చరిత్రలో పర్పిల్ కాప్ రెండు సార్లు గెలుచుకున్న రెండో బౌలర్ అయ్యాడు భువనేశ్వర్ కుమార్. 2017 లో జరిగిన ఐపీఎల్ లో కేవలం 14 మ్యాచ్ ల్లో 26 వికెట్లు తీసుకున్నాడు.

SHARE