చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక సభ్యుడు అయిన సురేష్ రైనా, కోల్ కతా నైట్ రైడర్స్ పై జరిగిన మ్యాచ్ లో తన కాలి పిక్క పై గాయం చేసుకున్నాడు. చేజింగ్ కు వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రైనా, లాంగ్ ఆన్ దిశగా కొట్టిన ఒక షాట్ తరువాత పరుగు చేసే సమయంలో ఈ గాయం కు గురి అయ్యాడు.

బుధవారం మెడికల్ రిపోర్టులు వచ్చిన తర్వాత అతను చెన్నై సూపర్ కింగ్స్ ఆడబోయే రెండు ఐపిఎల్ ఆటలకు అందుబాటులో ఉండలేడు అని తేలింది. చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత ఆదివారం కింగ్స్ లెవెన్ పంజాబ్‌తో తలపడనుండగా, తరువాత వచ్చే శుక్రవారం రాజస్థాన్ రాయల్స్ తో ఆడనున్నారు.

అయితే గత ఎనిమిది సంవత్సరాలుగా చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన ఒక్క మ్యాచ్ కూడా అతను మిస్ కాక పోవడం విశేషం. ఇదే అతను మొదటిసారి చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో ఆడకుండా ఉంటాడు.

ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన 134 ఐపీఎల్ ఆటల్లో పాల్గొన్న సురేష్ రైనా వారు ట్రోఫీ గెలిచిన రెండు సీజన్లలో కీలక పాత్ర పోషించాడు. అలానే వారు ఆడిన ఎనిమిది సీజన్లలో ప్లే ఆఫ్ దశకు చేరడంలో ముఖ్య భూమిక పోషించింది రైనా నే.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటికే చాలా మంది ఆటగాళ్లను గాయాల కారణం వల్ల కోల్పోయింది. తొలుత సీజన్ ప్రారంభం కాక ముందే న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ ను కోల్పోగా, ముంబై ఇండియన్స్ పై జరిగిన తొలి మ్యాచ్‌లో కేదార్ జాదవ్ హామ్‌స్ట్రింగ్ గాయం పాలయ్యాడు.

రిపోర్టులు వెల్లడైన తరువాత అతను ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం అయినట్టు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ప్రకటించింది. మరో వైపు సౌతాఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ ఇంకా తన వేలి గాయం నుండి కోలుకోలేదు.

ఆస్ట్రేలియాపై జరిగిన టెస్ట్ సిరీస్‌లో గాయం పాలైన డు ప్లెసిస్, వచ్చే మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశాలు మెండుగా ఉండటం జట్టుకు కొంత ఉపశమనాన్ని ఇస్తుంది. మరో వైపు భారత క్రికెటర్ మురళీ విజయ్ ముంబయి మ్యాచ్ ముందు నెట్ సెషన్లో గాయానికి గురి అయ్యాడు.

అయితే అతను కూడా బాగానే కోలుకోవటంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరింత ఊపిరి పీల్చుకోవచ్చు. అయితే సురేష్ రైనా వంటి మ్యాచ్ విన్నర్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేస్తారో ఇంకా తెలియటం లేదు.

మురళీ విజయ్ ను ఓపెనర్‌గా పంపించి షేన్ వాట్సన్ లేదా అంబటి రాయుడును మిడిల్ ఆర్డర్లో కి పంపే సూచనలు కనిపిస్తున్నాయి. అలానే యువ క్రికెటర్లు ధ్రువ్ షోరే, క్షితిజ్ శర్మ, జగదీశన్ లాంటి వాళ్లు కూడా జట్టులోకి రావచ్చు .

తొలి రెండు మ్యాచ్‌లలో విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్, తమ తరువాత మ్యాచ్‌లో ఫామ్‌లో ఉన్న కింగ్స్ లెవెన్ పంజాబ్‌తో తలపడనున్నారు.

SHARE