ఐపీఎల్ 2018 లో బొటను వేలుకి గాయం  అయ్యి ఇబ్బందులు  ఎదురుకుంటున్న వృద్ధిమాన్ సాహ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ ను ఆడడం అనుమానాస్పదంగా మారింది. అతను ఆఫ్గనిస్తాన్ తో జరిగిన ఏకైక టెస్ట్ కి ఎంపిక అయ్యాడు, కాని గాయం మానకపోవడం తో  ఆ మ్యాచ్ నుండి వైదొలగాల్సి వచ్చింది. టీం ఇండియా టెస్ట్ క్రికెట్ లో ఇష్టపడే వికెట్ కీపర్-బాట్స్మెన్ ఎవరైనా వున్నారు అంటే అది వృద్ధిమాన్ సాహనే,అలాంటి అతనికి IPL 2018 సమయంలో బొటనువేలికి గాయం అయ్యింది ,ఇంకా ఆ బొటను వేలు గాయం నుండి కోలుకోకపోవడంతో అతను ఇంగ్లాండ్ తో జరగబోయే 5 టెస్ట్ మ్యాచ్లకు ఆడటం అనుమానస్పదంగా మారింది.

కొలకత్తా నైట్ రైడర్స్ , శివమ్ మావి వేసిన బౌన్సర్ తో అతనికి గాయం అయ్యింది. దాని  ఫలితంగా టోర్నమెంట్ ఫైనల్ ని కూడా మిస్ అవ్వల్సి వచ్చింది .అటు తరువాత కూడా అతను ఇంకా ఆ గాయం నుండి కోలుకోకాపోవడం వల్ల ఆఫ్గనిస్తాన్ తో టెస్ట్ లో అతని స్థానం లో దినేష్ కార్తిక్ ఎంపిక అయ్యాడు. ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే, అతను ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లకు కూడా ఆడే అవకాశం కనిపించడంలేదు .

ఇంకో రెండు రోజులలో సెలెక్టర్లు  ఎంపిక లో అతను గనుక ఫిట్నెస్ సాధించకపోతే,దినేష్ కార్తిక్ లేదా పార్థివ్ పటేల్ టెస్ట్ జట్టులోకి ఎంపిక అయ్యే అవకశాలు వున్నాయి .KS భరత్ ,రిషబ్ పంత్ భారత్ A తరుపున ఇంగ్లాండ్ లోనే వున్నారు కాని వారికి వున్న అనుభవం రిత్యా వారిని ఇరువురిని టెస్ట్ ని ఆడించే సాహసం చెయ్యకపోవచ్చు. టెస్ట్ మ్యాచ్లు నుండి  ధోనీ పదవీ విరమణ చేసిన తర్వాత వికెట్ కీపర్ గా సెలెక్టర్ల మొదటి ఎంపిక గా వున్నవృద్ధిమాన్ సాహ తిరిగి టెస్ట్ మ్యాచ్ లలోగా కోలుకొని మెరుగైన ప్రదర్శనతో అక్కట్టుకోవాలని  ఆశ్సిదాం.

SHARE