భారత్ మహిళా క్రికెటర్ హర్మాన్ ప్రీత్ కౌర్, ప్రపంచం లోనే అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరు. ఆమె గత సంవత్సరం బిసిసిఐ అనుమతించడంతో మహిళా బిబిఎల్ లో పాల్గొన్నారు.

అయితే ఇప్పుడు మరో రెండు సంవత్సరాల పాటు ఆమె గత సంవత్సరం ఆడిన సిడ్నీ తన్ డర్ కు మరల ఆడేందుకు కాంట్రాక్టు ఒప్పుకున్నారు. కాంట్రాక్టు కొనసాగింపు కు ఇచ్చిన గడువు లో ఆఖరి రోజు కొత్త కాంట్రాక్టు తీసుకోవడం గమనార్హం.

మహిళా బిబిఎల్ ఈ సంవత్సరం డిసెంబర్ 9 నుండి ప్రారంభం కానున్నది. గత ఏడాది భారత్ నుంచి తొలి క్రికెటర్ గా బిబిఎల్ లో అడుగు పెట్టిన కౌర్, తన సత్తా ను చాటింది. గత సీజన్లో 296 పరుగులు చేసిన కౌర్, తన్ డర్ జట్టు లో రెండో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణి అయ్యింది.

ఆమె సగటు 59 కాగా, స్ట్రైక్ రేట్ 117 కావడం విశేషం. అంత అద్భుతం గా రాణించిన కౌర్ ను మరల తమ జట్టు లోకి తీసుకున్నందుకు సిడ్నీ జట్టు యాజమాన్యం కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు.

హర్మాన్ ప్రీత్ కౌర్ ను మరల జట్టు లోకి తీసుకోవడం పై ఆ జట్టు జనరల్ మేనేజర్ లీ గెర్మోన్ మాట్లాడుతూ, “కౌర్ మహిళా ప్రపంచ కప్ లో తన సత్తా చాటింది. ఆ టోర్నమెంట్ లో ఆమె ఆదిని తీరు తో ఆమె ప్రపంచం లోనే అత్యుత్తమ హార్డ్ హిట్టర్ అని నిరూపించుకుంది,” అని అన్నారు.

మహిళా ప్రపంచ కప్ సెమి ఫైనల్ ఆమె ఆస్ట్రేలియా పై సాధించిన 171 పరుగుల ఇన్నింగ్స్ అందరికి గుర్తుండి పోతుంది. సిడ్నీ జట్టు కేవలం రెండు ఓవర్సీస్ క్రికెటర్లకు మాత్రమే కాంట్రాక్టు ఇవ్వాల్సి ఉండగా, రెండో క్రికెటర్ గా న్యూజిలాండ్ వికెట్ కీపర్ రాచెల్ ప్రీస్ట్ కాంట్రాక్టు ఒప్పుకుంది.

హర్మాన్ ప్రీత్ కౌర్ తన స్పిన్ తో కూడా మాయ చేయగలగడం తో ఆమె ఈ ఏడాది బిబిఎల్ లో కూడా ఎంతో ముఖ్య భూమిక పోషించవచ్చు.

SHARE