ఆశిష్ నెహ్రా ఎంపిక తనను ఏమాత్రం ఆశ్చర్యానికి గురిచేయలేదు అని మాజీ భారత క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పారు.

38 సంవత్సరాలు వచ్చిన సరే ఒక పేస్ బౌలర్ అయ్యుండి కూడా నెహ్రా ఇంకా టీంలోకి ఎంపిక అవ్వడం ఆశ్చర్యపోయే విషయమే అయిన, నెహ్రా తన ప్రతిభను గత 18 నెలలు గా పొట్టి ఫార్మటు లో చూపిస్తూనే ఉన్నారు.

తదుపరి టీ20 ప్రపంచ కప్ ఇంకో 3 సంవత్సరాల వరకు లేకపోవడం తో చాలా మంది నెహ్రాను ఇంకా పక్కన పెడతారు అని భావించారు. కానీ కేప్టిన్ విరాట్ కోహ్లీ మరియు సెలక్షన్ కమిటీ, వెటరన్ బౌలర్ కు వచ్చే ఆసీస్ సిరీస్ లో అదేంషుకు ఆమోదం తెలిపారు.

చిన్నపట్నుంచి నెహ్రా తో క్రికెట్ ఆడిన సెహ్వాగ్, నెహ్రాకు ఉన్న ఫిట్ నెస్ వల్లే ఇంత వయసు వచ్చిన టీం లోకి ఎంపిక అవుతున్నాడు అని అభిప్రాయపడ్డారు. మ్యాచ్ లేని సమయంలో నెహ్రా 8 గంటలు జిం లో శ్రమిస్తాడు అని చెప్పుకొచ్చారు.

మరో వైపు, సెహ్వాగ్ టీం నుంచి ఫిట్ నెస్ లేక వెలువడిన యువరాజ్ సింగ్ మరియు సురేష్ రైనా లను తమ ఫిట్ నెస్ పై పూర్తి ద్రుష్టి పెట్టమని సలహా ఇచ్చారు. ఫిట్ గా ఉంటే మాత్రమే ఈ కొత్త క్రికెట్ ప్రపంచంలో మనుగడ ఉంటుంది అన్నారు.

“రిపోర్ట్స్ లో చూస్తే చాలా మంది క్రికెటర్లు, యువరాజ్ సింగ్ మరియు సురేష్ రైనా తో సహా, యో యో టెస్టు ఫెయిల్ అవుతున్నారు. బహుశా దీని వల్లే వాళ్ళు టీం లోకి ఎంపిక అవ్వలేదు. యువరాజ్ మరియు రైనా యో-యో టెస్టు పాస్ అవ్వడానికి ద్రుష్టి పెట్టాలి అని నేను అనుకుంటున్నాను,” అని చెప్పారు.

SHARE