మాజీ భారత్ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ త్వరలో శ్రీలంక పై మొదలయ్యే వన్ డే, టీ 20 సిరీస్ లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కు విశ్రాంతి ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.

వచ్చే ఏడాది సౌత్ ఆఫ్రికా పై జరిగే సిరీస్ కు సన్నద్ధం కావడానికి సమయం లేదు అని విరాట్ కోహ్లీ చెప్పిన విషయం తెలిసిందే. అయితే పూర్వం 2010 లో భారత్ సౌత్ ఆఫ్రికా సిరీస్ ఆడే ముందు అప్పటి సారధి ఎం ఎస్ ధోని కూడా అలానే విశ్రాంతి తీసుకున్న విషయం గుర్తు చేసారు.

అప్పట్లో గౌతమ్ గంభీర్ న్యూజిలాండ్ పై జరిగిన సిరీస్ లో కెప్టెన్సీ వహించగా, ప్రస్తుత జట్టు లో రోహిత్ శర్మ రాబోయే సిరీస్ లో కెప్టెన్సీ బాధ్యతలు వహించాలి అని సూచించారు.

“విరాట్ కోహ్లీ కొంత సమయం కుటుంబం తో గడపాలి. గతం లో ధోని కూడా ఇలానే విశ్రాంతి తీసుకొని, గౌతమ్ గంభీర్ కు కెప్టెన్సీ ఇవ్వడం మనం చూసాం. అప్పట్లో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు.

“అలానే ఇప్పుడు వచ్చే శ్రీలంక సిరీస్ లో కూడా విరాట్ కోహ్లీ ఆడకపోయినా భారత్ మ్యాచ్ ఓడిపోదు. విరాట్ కోహ్లీ స్థానం లో రోహిత్ శర్మ కెప్టెన్సీ చేయాలి,” అని సూచించారు.

ఇటీవలే విరాట్ కోహ్లీ సౌత్ ఆఫ్రికా సిరీస్ కు సన్నద్ధం కావడానికి సమయం లేదు అని చెప్పిన విషయాన్నీ వీరేంద్ర సెహ్వాగ్ కూడా వెనకేసుకొచ్చాడు. భారత్ జట్టు శ్రీ లంక పై ఆఖరి టీ 20 ఆడిన రెండు రోజుల్లోనే సౌత్ ఆఫ్రికా కు బయలుదేరనుంది.

“సౌత్ ఆఫ్రికా సిరీస్ కు భారత్ జట్టు తాయారు అవ్వడానికి కేవలం రెండు ప్రాక్టీస్ మ్యాచ్లే ఉన్నాయి. ఒకవేళ ఆ రెండు మ్యాచ్లలో వర్షం పడితే, భారత్ జట్టు చాల కష్టాలు పడే అవకాశం ఉంది.

“సిరీస్ కు ముందు ఒక రెండు వారలు ముందే భారత్ జట్టు సౌత్ ఆఫ్రికా వెళ్లి ఉంటె, అక్కడ పరిస్థితులను అర్ధం చేసుకొని బాగా అదే అవకాశం ఉండేది. భారత్ బోర్డు చాలా ప్రణాళిక సరిగా లేదు. బహుశా శ్రీలంక సిరీస్ మరింత చిన్నది చేసి ఉంటే బాగుందేది.”

SHARE