ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ జాన్సన్ ఇటీవలే వచ్చిన వరల్డ్ క్లాస్ బౌలర్లలో ఒకరు. అయన రిటైర్ కాక ముంది ఆఖరి కొన్ని సంవత్సరాలు ప్రపంచం లో ఉన్న అత్యుత్తమ బ్యాట్స్ మెన్ అందరిని వణికించారు.

అతని దూకుడు స్వభావం, వేగవంతమైన బంతులు బ్యాట్స్ మెన్ ను చాలా పరీక్షించాయి. అతను ఇటీవలే జరిగిన యాషెస్ సిరీస్ లలో ఆస్ట్రేలియా కు బెస్ట్ బౌలర్.

అయితే జాన్సన్ కేవలం బంతితోనే కాకుండా తన మాటలతో కూడా పిచ్ పై యుద్ధం చేసేవాడు. స్లేజింగ్ పేరు సంపాదించిన జాన్సన్, విరాట్ కోహ్లీ మరియు జో రూట్ లాంటి బాట్స్మెన్ కూడా స్లేజింగ్ చేయడం అప్పట్లో చాలా మందిని ఆకర్షించింది.

NOTTINGHAM, ENGLAND – AUGUST 07: Mitchell Johnson of Australia reacts while bowling as Joe Root of England runs between wickets during day two of the 4th Investec Ashes Test match between England and Australia at Trent Bridge on August 7, 2015 in Nottingham, United Kingdom. (Photo by Ryan Pierse/Getty Images)

అయితే స్లేజింగ్ గురించి మాట్లాడుతూ గత యాషెస్ సిరీస్ తో స్టువర్ట్ బ్రాడ్ తో జరిగిన సంఘటనే తన మంది లో ఇంకా ఉందని అని పేర్కొన్నారు.

అయితే భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ను స్లేజింగ్ చేసిన జాన్సన్, ఈ ఇరువురు స్లేజింగ్ కు ఎలా స్పందిస్తారో చెప్పారు.

“విరాట్ కోహ్లీ పై స్లేజింగ్ చేస్తే తిరిగి చేస్తాడు, కానీ రూట్ నవ్వుకొని వదిలేస్తాడు. కానీ స్టువర్ట్ బ్రాడ్ స్లేజింగ్ మాత్రమే నాకు యాషెస్ సిరీస్ లో బాగా గుర్తుండేది,” అని జాన్సన్ చెప్పారు.

2013 – 14 లో ఆస్ట్రేలియా లో జరిగిన యాషెస్ సిరీస్ లో మిట్చెల్ జాన్సన్ తన విశ్వ స్వరూపాన్ని చూపించిన విషయం అందరికి గుర్తుంది. కానీ అయన ఆ రేంజ్ కి ఎదగడానికి చాలానే ఒడిదుడుకులు ఎదుర్కున్నాడు.

” నా కెరీర్ మొదటి భాగం లో నా బాడీ లాంగ్వేజ్ అంత బాగుందేది కాదు. కానీ చివరి భాగం లో నేను ఈ విషయం లో పై చేయి సాధించాను. బ్యాట్స్ మెన్ బంతిని ఏజ్ చేస్తే వెళ్లి నేను ఎం అనుకునే వాడినో చెప్పే వాడిని.”

SHARE