లీడ్స్: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ పేరిట వున్న రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు.అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లో మూడు వేల పరుగులు చేసిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు.ఈ మ్యాచ్‌లో 15 పరుగులు పూర్తి చేయగానే కెప్టెన్‌గా అతి తక్కువ వన్డేల్లో 3000 పరుగులు పూర్తి చేసిన కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. కోహ్లీ 49 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్ లో కోహ్లి 55 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు.
కెప్టెన్ గా 3000 పరుగులు చేసిన ఆటగాళ్ళు :
Country | Player | Number of Innings |
సౌత్ఆఫ్రికా | డివిలియర్స్ | 60 |
భారత్ | ధోనీ | 70 |
భారత్ | సౌరవ్ గంగూలీ | 74 |
సౌత్ఆఫ్రికా | గ్రేమ్ స్మిత్ | 83 |
పాకిస్తాన్ | మిస్బా వుల్ హక్ | 83 |
శ్రీలంక | సనత్ జయసూర్య | 84 |
ఆస్ట్రేలియా | రికీ పాంటింగ్ | 84 |