భారత్ క్రికెట్ బోర్డు బిసిసిఐ ఇటీవలే అనధికారంగా సచిన్ టెండూల్కర్ వేసుకున్న నెం 10 జెర్సీ విషయం తెలిసిందే. ఈ మధ్య కాలం సచిన్ రిటైర్ అయినా ఐదు సంవత్సరాల తర్వాత పేస్ బౌలర్ షార్డుల్ ఠాకూర్ ధరించాడు.

అయితే ఈ యువ బౌలర్ నెం 10 జెర్సీ వేసుకోవడం చుసిన అనేక మంది అభిమానులు సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. శ్రీలంక పై శ్రీలంక లో జరిగిన వన్ డే సిరీస్ లో తొలి సారి అరంగ్రేటం చేసిన ఠాకూర్, తర్వాత జరిగిన సిరీస్ లో తన జెర్సీ నెంబర్ మార్చుకున్నాడు.

అయితే చాలా మంది ఆ సంఘటన తర్వాత బిసిసిఐ మరో క్రికెటర్ కు ఠాకూర్ ల జారకకూడదని నెం 10 జెర్సీ ని రిటైర్ చేసింది అని అంత భావించారు. అయితే నిజం వేరే ఉంది. సచిన్ టెండూల్కర్ పై ఉన్న గౌరవం తో భారత్ జట్టులో ఎవరు ఆ జెర్సీ తీసుకోవడానికి ఇష్టపడలేదు అంట.

“అది కేవలం ఆటగాళ్ల ఛాయిస్. ఒక ఆటగాడికి ఒక నెంబర్ జెర్సీ వేసుకోవాలని లేకపోతే మనం ఒత్తిడి చేయలేము. ఐసిసి రూల్స్ ప్రకారం ఏ అంకె జెర్సీ ను కూడా రిటైర్ చేయలేం,” అని ఒక బిసిసిఐ అధికారి చెప్పారు.

“బిసిసిఐ సచిన్ టెండూల్కర్ జెర్సీ రిటైర్ చేయాలనీ ఎక్కువంటి నిర్ణయం తీసుకోలేదు. అలా అని యువ క్రికెటర్లు ఠాకూర్ లాంటి వాళ్ళను తిట్టడం కూడా సబబు కాదు,” అని చెప్పారు.

ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ లో జెర్సీ రిటైర్ చేసిన దాఖలాలు లేవు. కానీ ఐపిఎల్ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ జట్టు ముంబై ఇండియన్స్ అతనికి నివాళిగా నెం 10 జెర్సీ ను రిటైర్ చేసారు. అంటే భవిష్యత్తులో ఎవరు ముంబై ఇండియన్స్ కి ఆడిన నెం 10 జెర్సీ ధరించలేరు.

SHARE