శ్రీ లంకకు స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ళు సందర్భంగా ఆడుతున్న నిదాహస్ ట్రోఫీ లో తొలి టీ 20 లో భారత్ జట్టు పై ఆతిధ్య జట్టు సులువైన విజయం సాధించింది.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక 9 పరుగులకే కెప్టెన్ రోహిత్ శర్మ ను, వెటరన్ ఆటగాడు సురేష్ రైనా ను అవుట్ చేసి మ్యాచ్ పై మంచి పట్టు సాధించారు. కానీ మరో ఓపెనర్ శిఖర్ ధావన్, మనీష్ పాండే తో కలిసి భారత్ ఇన్నింగ్స్ ను సరిదిద్దాడు.

కేవలం 49 బంతుల్లో 90 పరుగులు చేసిన ధావన్ కు సరైన సహకారం అందలేదు, అతను కాకుండా మనీష్ పాండే మరియు రిషబ్ పంత్ ఆడిన, వారు సరైన వేగంతో పరుగులు చేయలేకపోవడం తో భారత్ నిర్ణిత 20 ఓవర్లలో 174 పరుగులు చేసింది.

చేజింగ్ కు వచ్చిన శ్రీలంక జట్టు ఆదిలోనే కుశాల్ మెండిస్ వికెట్ కోల్పోగా, మూడో స్థానం లో వచ్చిన కుశాల్ పెరెరా సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 37 బంతుల్లో 66 పరుగులు చేసిన మెండిస్, ఒకే ఒక ఓవర్ లో శార్దూల ఠాకూర్ వేసిన ప్రతి బంతిని బౌండరీకి తరలించాడు.

అయితే అతన్ని అవుట్ చేసే సమయానికే మ్యాచ్ శ్రీలంక మరలిపోయింది. భారత్ బౌలర్లలో కేవలం వాషింగ్టన్ సుందర్ మాత్రమే అందరిని ఆకట్టుకున్నాడు.

Colombo : Sri Lanka’s Kusal Perera celebrates scoring a half century against India during their Twenty20 cricket match in Nidahas Triangular series in Colombo, Sri Lanka, Tuesday, March 6, 2018. AP/ PTI(AP3_6_2018_000192B)

తన సంచలన ఇన్నింగ్స్ కు మాన్ అఫ్ ది మ్యాచ్ గా ఎంపికైన కుశాల్ పెరీరా మాట్లాడుతూ, “నా కెరీర్లో ఆడిన బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే, దీని కంటే మంచి ఇన్నింగ్స్ ఆడినప్పటికీ నాకు ఇదే బెస్ట్. ఈ మధ్య కాలం లో నెట్స్ లో బాల్ ను గట్టిగా బాదటం పై ద్రుష్టి పెట్టా.

“భారత్ ను కేవలం 174 కే పరిమితి చేసి బౌలర్లు చాలా మంచి పని చేసారు. విజయంలో క్రెడిట్ వాళ్ళకి కూడా వెళ్ళాలి. “

SHARE