భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ 20 సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్లలో ఫీల్డింగ్ లో రెండు జట్లు చాలా తప్పులు చేసాయి. కానీ మూడవ టీ 20 మ్యాచ్ లో మాత్రం ఇరు జట్లు అద్భుత ఫీల్డింగ్ చేసాయి.

సిరీస్ లో తొలి రెండు మ్యాచ్లలో సరిగా ఫీల్డింగ్ చేయని సంట్నర్ మాత్రం మూడవ టీ 20 మరిచిపోలేదు. మ్యాచ్ కు ముందు తమ జట్టు ఫీల్డింగ్ లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తేనే మ్యాచ్ గెలుస్తారు అని చెప్పిన సంట్నర్, ముందుండి జట్టును ఫీల్డ్ పై నడిపాడు.

భారత్ ను తొలుత బాటింగ్ చేయించిన న్యూజిలాండ్, మూడో ఓవర్ లోనే వరుస బంతుల్లో ధావన్, రోహిత్ ను అవుట్ చేసారు. అయితే రెండు మంచి క్యాచ్ లు పట్టి సంట్నర్ ముఖ్య పాత్ర పోషించాడు.

రోహిత్ క్యాచ్

అయితే మ్యాచ్ లో అసలైన ఫీల్డింగ్ ప్రతిభ మాత్రం భారత్ ఇన్నింగ్స్ లో ఆఖరి ఓవర్ లో సంట్నర్ చేసాడు. జోరుగా ఆడుతున్న మనీష్ పాండే మిడ్ వికెట్ మీదుగా సిక్స్ కు ప్రయత్నించగా, లాంగ్ ఆన్ లో ఉన్న సంట్నర్ చాలా దూరం పరిగెత్తి బాల్ ను అందుకున్నాడు.

కానీ బౌండరీ ని తాకే అవకాశం ఉందని భావించిన సంట్నర్, వెంటనే ఆ బంతిని అవతలి వైపు నుంచి వస్తున్న గ్రాండ్ హోమ్ దిశగా విసిరాడు. అతను ఆ క్యాచ్ పట్టుకోవడం తో పాండే నిష్క్రమించాల్సి వచ్చింది .

ఆ వికెట్ వీడియో మీరే చుడండి : 

SHARE