భారత్ పై ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్ లో అద్భుతంగా రాణిస్తున్న కెప్టెన్ దినేష్ చండీమల్ కు శ్రీలంక సెలెక్టర్లు మొండి చెయ్యి చూపించారు.

మూడో మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో రెండు అర్ధ సెంచరీలు సాధించిన చండీమల్, ప్రస్తుతం జరుగుతున్న ఢిల్లీ టెస్టు లో కూడా తన చక్కటి ఆట తో శ్రీలంక ఫాలో ఆన్ ఆడకుండా చేసాడు. అయితే శ్రీలంక సెలెక్టర్లు తుది 15 మంది లో చండీమల్ పేరు లేకపోవడం గమనార్హం.

కానీ చండీమల్ వన్ డే ల్లో ఇటీవలే చాలా తక్కువ స్కోర్లు సాధించాడు. పాకిస్తాన్ పై జరిగిన సిరీస్ లో 4, 2, 9, 16 మరియు 0 తో తన స్థానాన్ని జట్టు నుండి కోల్పోయాడు. మరో వైపు సీనియర్ ఆటగాడు లసిత్ మలింగా ను కూడా జట్టు లోకి ఎంపిక చేయలేదు.

గత 19 నెలలు గా మలింగా ఫామ్ చాలా దారుణం గా ఉంది. 13 వన్ డే మ్యాచ్ లు ఆడిన లసిత్ మలింగా కేవలం 10 వికెట్లు మాత్రమే తీయగా, అతని సగటు 62.30. తొలి టెస్టు లో బొటను వేలు గాయం దూరమైనా అసేలా గుణరత్నే ను వన్ డే సిరీస్ కు తిరిగి ఎంపిక చేసారు. యువ క్రికెటర్ సాధీర సమరవిక్రమ కు కూడా సెలెక్టర్లు మొగ్గు చూపారు.

భారత్ సిరీస్ కు శ్రీలంక సెలెక్టర్లు కొత్త కెప్టెన్ గా తీసారా పెరెరాను పేర్కొనగా, మాజీ కెప్టెన్ ఉపుల్ తరంగ కూడా జట్టు లో స్థానం సంపాదించాడు. భారత్ పై 5-0 తో సొంత గడ్డ పై ఓడిపోయిన శ్రీలంక, అదే విధంగా UAE లో పాకిస్తాన్ పై 5-0 తో ఓడిపోయింది.

త్వరలో ప్రారంభం కానున్న వన్ డే సిరీస్ లో మంచి ప్రదర్శన ఇచ్చేందుకు శ్రీలంక జట్టు ఊవిళ్లురుతుంది. భారత్ పై వన్ డే సిరీస్ డిసెంబర్ 10 న ధర్మశాలలో మొదలవుతుంది.

శ్రీలంక జట్టు: థేసర పెరెరా (కెప్టెన్), ఉపల్ తరంగ, డాన్షుకా గుణతిలకా, నిరోషాన్ డిక్వెల్లా, సడేరా సమరవిక్మరా, లాహరి త్రిమన్నే, ఏంజెలో మాథ్యూస్, ఆసళ గుణరట్నే, చతురంగా ​​దే సిల్వా, సచిత్ పతిరనా, అకిలా దానంజయ, జెఫ్రీ వెండెర్సే, దుష్మంత చమేరా, సురంగ లక్మల్, నవీన్ ప్రదీప్

SHARE