సౌత్ ఆఫ్రికా పర్యటన అంచనాలకు మించి రాణిస్తున్న కోహ్లీ సేన, రెండో టీ20 కు సన్నద్ధం అవుతుంది. మరో అత్యుత్తమ పెర్ఫార్మన్స్ తో తొలి టీ 20 అలవోకగా గెలిచినా భారత్, రెండో మ్యాచ్ గెలిచి టీ20 సిరీస్ గెలవాలని గట్టిగా భావిస్తున్నారు. అయితే సెంచూరియన్ లో జరిగే ఈ రెండో టీ 20 కు జట్టు ఈ విధంగా ఉండొచ్చు.

రోహిత్ శర్మ

తొలి టీ 20 లో వేగవంతమైన 21 పరుగులు చేసిన రోహిత్ శర్మ మరో సారి ఓపెనర్ స్థానంలో జట్టులో ఆడటం ఖాయం గా కనిపిస్తుంది.

శిఖర్ ధావన్

భారత్ ను తొలి టీ 20 లో ముందుండి నడిపించాడు. తన కెరీర్ లోనే అత్యుత్తమ ఫామ్ లో ఉన్న ధావన్ రోహిత్ శర్మ తో ఓపెనింగ్ జోడి గా బరిలోకి దిగనున్నాడు.

విరాట్ కోహ్లీ

తన కెరీర్ లో అత్యంత అద్భుతమైన ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ, మరో సారి భారత్ ను ముందుండి నడిపించడం పక్కగా కనబడుతుంది.

సురేష్ రైనా

తొలి టీ 20 లో వేగవంతంగా ఆడిన సురేష్ రైనా, భారత్ జట్టుకు ఎంతో ముఖ్యమైన ఆటగాడు. రెండో మ్యాచ్ లో కూడా మిడిల్ ఆర్డర్ లో సురేష్ రైనా ఆడటం పక్కగా కనిపిస్తుంది.

మనీష్ పాండే

సౌత్ ఆఫ్రికా లో తొలి టీ20 లో మొదటి సారి అవకాశం పొందిన మనీష్ పాండే, సరిగా ఆడలేకపోయాడు. 27 బంతుల్లో 29 పరుగులు చేసిన పాండేకు మరో అవకాశం దక్కనుంది.

ఎం ఎస్ ధోని

ధోని లేని భారత్ జట్టు ను ప్రస్తుతం ఆలోచించడం చాలా కష్టం, అతని తెలివితో బౌలర్లు లకు సలహాలు ఇచ్చే విధానం ప్రశంసనీయాం. మరో సారి వికెట్ల వెనకాల ధోని ని చూడటం ఖరారు అనే చెప్పాలి

హార్దిక్ పాండ్య

భారత్ క్రికెట్ లో ముఖ్యమైన ఆటగాడిగా ఎదిగిన హార్దిక్ పాండ్య, కేవలం బాట్ తోనే కాకుండా బౌలర్ గా కూడా చాలా ఎదిగాడు. ఫీల్డింగ్ లో కొసమెరుపు లాంటి వేగం కలిగిన హార్దిక్, జట్టు కావాల్సిన ముఖ్యమైన సంతులనం ఇస్తాడు.

యుజ్వేంద్ర చాహల్

భారత్ కు ఎంతో ముఖ్యమైన స్పిన్ బౌలర్ గా ఎదిగిన క్సహాహాల్, మొదటి టీ 20 లో అంతగా రాణించలేదు. అయితే వికెట్లు తీయడంలో దిట్ట అయినా చాహల్ తుది జట్టు లో లేకపోవడం చాలా కష్టం.

కుల్దీప్ యాదవ్

23 సంవత్సరాలకే ప్రపంచ అగ్ర స్పిన్నర్ల సరసన చేరుతున్న కుల్దీప్, తొలి టీ 20 ను గాయం కారణంగా ఆడలేకపోయాడు. అయితే రెండో టీ20 అతను అందుబాటులో ఉంటాడు.

భువనేశ్వర్ కుమార్

Pune: India’s Bhuvneshwar Kumar celebrates the wicket of New Zealand batsman Martin Guptill during their 2nd ODI cricket match in Pune on Wednesday. PTI Photo by Shashank Parade (PTI10_25_2017_000043B)

అన్ని ఫార్మాట్లలోనూ భారత్ కు అగ్ర బౌలర్ గా ఎదిగిన భువనేశ్వర్ కుమార్, తొలి టీ 20 లో ఐదు వికెట్లు తీసుకుని అందరిని అబ్బురపరిచారు.

జస్ప్రీత్ బుమ్రా

తొలి టీ 20 లో వికెట్లు తీయని బుమ్రా, తన స్థాయి తగినట్టు రాణించలేదు. అయితే ప్రపంచం లోనే అత్యుత్తమ డెత్ ఓవర్ బౌలర్ సేవలు లేకుండా కోహ్లీ ముందుకు వెళ్ళడు.

SHARE