భారత్ క్రికెట్ దిగ్గజం మరియు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, కోహ్లీ సేన కు అసలైన పరీక్షా దక్షిణా ఆఫ్రికా సిరీస్ నుండి మొదలు అవుతుంది అని అభిప్రాయపడ్డారు.

విరాట్ కోహ్లీ పూర్తి స్థాయిలో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టినప్పుడు నుండి యావత్తు టీం చక్కగా ఆడారు. ప్రస్తుతం భారత జట్టు టెస్టు, ఒన్డే లలో నెం. 1 రాంక్ సాధించి 2000 దశకం లో ఆస్ట్రేలియా సరసన చేరారు.

అగ్ర స్థానంలో కొనసాగడానికి ఈ సంవత్సరం పెద్ద ఆటంకాలు లేకపోయినా వచ్చే ఏడాది భారత జట్టు దక్షిణా ఆఫ్రికా కు వెళ్లనుంది. ఆ తరువాత ఇంగ్లాండ్ లో సిరీస్, సంవత్సరం చివర్లో ఆస్ట్రేలియా తో కూడా సిరీస్ ఆడే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి.

ఈ పరిమాణం లో సౌరవ్ గంగూలీ వచ్చే 15 నెలలు చాలా కీలకం అని అభిప్రాయపడ్డారు. వచ్చే ఓవర్సీస్ సిరీస్ లో విరాట్ కోహ్లీ తన నాయకత్వం నిరూపించుకోగలిగితే చాలా గొప్ప కెప్టెన్ వత్తాడు అని చెప్పుకొచ్చారు. ఈ విదేశీ పర్యటనలు భారత జట్టుకు 2019 ప్రపంచ కప్ కు తయారు అయ్యేందుకు బాగా ఉపయోగపడతాయి.

భారత జట్టు ఈ వారం ఆసీస్ తో టీ 20 సిరీస్ లో తలపడగా, త్వరలో న్యూ జీలాండ్ మరియు శ్రీ లంక తో సొంత గడ్డపై ఆడతారు. నూతన సంవత్సరం లో సౌత్ ఆఫ్రికా తో సిరీస్ ప్రారంభం కానుంది.

‘త్వరలో సొంతగడ్డపై న్యూజిలాండ్‌, శ్రీలంకతో కోహ్లీ సేన తలపడనుంది. ఈ రెండు దేశాలపై భారత్‌ తప్పక విజయం సాధిస్తుంది. కోహ్లీ సేనకు సవాలు ఎదురయ్యేది ఎప్పుడంటే దక్షిణాఫ్రికా పర్యటనలో. అక్కడ కూడా మెరుగ్గా రాణించి విజయాలు నమోదు చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని గంగూలీ చెప్పారు.

SHARE