సౌత్ ఆఫ్రికా లో చారిత్రాత్మక సిరీస్ విజయం సాధించిన భారత్ క్రికెట్ జట్టు, ఆఖరి వన్డే మ్యాచ్ తుది జట్టు లో కొన్ని మార్పులు చేసే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. పోర్ట్ ఎలిజబెత్ లో జరిగిన ఇదో వన్డేలో మరో సారి తమదైన ప్రదర్శన తో 73 పరుగులతో గెలిచినా భారత్, చివరి వన్ డే కూడా గెలిచి సిరీస్ ను 5-1 తో గెలవాలని ఊవిళ్లురుతుంది.

ఐతే సిరీస్ చేజిక్కిన్చుకున్నా భారత్ జట్టు, భారీ గా మెరుపులు చేసే ఆలోచనలేకపోగా, తమ బెంచ్ బలం పరీక్షించుకోడానికి చూస్తున్నారు. ఆఖరి వన్డే లో భారత్ జట్టు ఇలా ఉండవొచ్చు.

టాప్ ఆర్డర్

అజింక్య రహానే

PORT OF SPAIN, TRINIDAD & TOBAGO – JUNE 25: Ajinkya Rahane of India reacts during the second match between West Indies and India as part of the Seagrams Royal Stag Mega Cricket Cup 2017, One Day International Series at Queen’s Park Oval on June 25, 2017 in Port of Spain, Trinidad & Tobago. (Photo by Ashley Allen/LatinContent/Getty Images)

తొలి వన్డే 4 వ స్థానంలో వచ్చి చక్కగా అలరించిన రహానే, తరువాత వన్డేల్లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఫామ్ లో ఉన్న శిఖర్ ధావన్ కు విశ్రాంతి కల్పించి, రహానే ను మరల ఓపెనర్ స్థానంలో ఎంపిక చేయొచ్చు.

రోహిత్ శర్మ

సిరీస్ లో అంచనాలకు సరిపడా రాణించని రోహిత్ శర్మ, ఐదో వన్డే లో తన ట్రేడ్ మార్క్ ఇన్నింగ్స్ ఆడి భారత్ కు విలువైన స్కోర్ అందించాడు. ఆఖరి వన్డేలో కూడా అతను మరో సారి ఓపెనర్ గా పవర్ ప్లే ఓవర్లలో బౌలర్లులకు చుక్కలు చూపించడం ఖాయం.

విరాట్ కోహ్లీ

తన కెరీర్ లో అత్యంత అద్భుతమైన ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ, మరో సారి భారత్ ను ముందుండి నడిపించడం పక్కగా కనబడుతుంది.

మిడిల్ ఆర్డర్

మనీష్ పాండే

భారత్ క్రికెట్ లో నాలుగో నెంబర్ స్థానం యువరాజ్ సింగ్ కాన్సర్ వచ్చినప్పటి నుంచి ఖాళీగానే ఉంది. అయితే ఈ సిరీస్ లో రహానే, శ్రేయాస్ ఐయెర్ తో ప్రయోగం చేసిన భారత్, మరో సారి మనీష్ పాండే ను ప్రయత్నించవచ్చు.

శ్రేయాస్ ఐయెర్

ఇంకా తన అంతర్జాతీయ కెరీర్ లో ఇప్పుడు తొలి అడుగులు వేస్తున్న శ్రేయాస్ ఐయెర్ కు భారత్ క్రికెట్ యాజమాన్యం మరో అవకాశం ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.

అయితే తొలుత బాగానే ఆడుతున్న ఐయెర్ 20 -30 లను అర్ధ శతకాలుగా మార్చుకోవడం నెర్చుకోవాల్సి ఉంది.

ఎం ఎస్ ధోని

వన్డే క్రికెట్ లో మరో 37 పరుగులు ధోని చేస్తే, 10000 పరుగులు సాధించిన నాలుగో భారత్ క్రికెట్ అవనున్నాడు. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ మరియు రాహుల్ ద్రావిడ్ మాత్రమే ఈ మైలురాయి ను సాధించారు.

ధోని లేని భారత్ జట్టు ను ప్రస్తుతం ఆలోచించడం చాలా కష్టం, అతని తెలివితో బౌలర్లు లకు సలహాలు ఇచ్చే విధానం ప్రశంసనీయాం.

అల్ రౌండర్స్

హార్దిక్ పాండ్య

భారత్ క్రికెట్ లో ముఖ్యమైన ఆటగాడిగా ఎదిగిన హార్దిక్ పాండ్య, కేవలం బాట్ తోనే కాకుండా బౌలర్ గా కూడా చాలా ఎదిగాడు. ఫీల్డింగ్ లో కొసమెరుపు లాంటి వేగం కలిగిన హార్దిక్, జట్టు కావాల్సిన ముఖ్యమైన సంతులనం ఇస్తాడు.

అక్షర్ పటేల్

జట్టులో మణికట్టు స్పిన్నర్లు చక్కగా రాణిస్తుండడంతో అక్షర్ పటేల్ కు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. అయితే బాట్ తో కూడా చక్కగా ఆడగలిగే అక్షర్ కు ఆఖరి వన్డే లో అవకాశం కచ్చితంగా రావొచ్చు.

బౌలర్లు

మహమ్మద్ షమీ

భారత్ జట్టులో ప్రస్తుతం పేసర్లు చాలా మందే ఉండారు. అయితే షమీ తనకంటూ ఒక పేరు తెచ్చుకున్న తరువాత, గాయాల కారణంగా చాలానే బాధలు అనుభవించాడు.

అతను కోలుకుంటున్న సమయంలో జస్ప్రీత్ బుమ్రా వెలుగులోకి రావడంతో, భారత్ కు ముఖ్యమైన టెస్టు బౌలర్ గానే ఆయన ప్రస్తుతం ఉన్నాడు.

శార్దూల్ ఠాకూర్

భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా ఇద్దరికీ విశ్రాంతి కలిపించే ఆలోచనలో ఉన్న భారత్ జట్టు యాజమాన్యం, ముంబై పేసర్ శార్దూల ఠాకూర్ కు అవకాశం ఇవ్వొచ్చు.

శ్రీలంక పై ఆఖరి సారి భారత్ కు ఆడిన ఠాకూర్, తనకు సెలెక్టర్లు ఎందుకు అంత మద్దతు ఇస్తున్నారో నిరూపించుకోవడానికి మంచి అవకాశం.

యుజ్వేంద్ర చాహల్

ముఖ్యమైన బౌలర్లు అందరికి విశ్రాంతి కలిపించే ఆలోచన లో ఉన్న భారత్ జట్టు యాజమాన్యం, యుజ్వేంద్ర చాహల్ ను మాత్రం మరో సారి తుది జట్టులో ఎంపిక చేస్తారు.

కోహ్లీకి ఎప్పుడు వికెట్ కావాల్సిన అందించిన చాహల్, చివరి వన్డే లో కూడా భారత్ విజయావకాశలకు ఎంతో ముఖ్యమైన ఆటగాడు.

SHARE