NYSD క్రికెట్ లీగ్ లో భారత క్రికెట్ దిగ్గజం శ్రీకాంత్ వా పది వికెట్లు తీసుకున్నాడు

న్యూ ఢిల్లీ : భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటన రేపు మంగళవారం నుండి  మూడు మ్యాచ్ T20 సిరీస్ తో  ప్రారంభమవుతుంది. బిసిసిఐ డెత్ ఓవర్  నిపుణుడు అయిన జస్ప్రీత్ బూమ్హ్ర కు  ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నప్పుడు, విదర్భ నుండి వచ్చిన  పేసర్  ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్లో పది వికెట్లు తీసీ సంచలనం సృష్టించాడు.  భారత దేశం నుండి విదర్భ  తరుపున ఆడే శ్రీకాంత్ వా ఈ ఫీట్ ని బలహీనమైన జట్టు పైన కాకుండా లీగ్ లో అత్యద్భుతమైన ప్రదర్శనను  కనబరిచే టీం పై చెయ్యడం విశేషం. శ్రీకాంత్ కి  ఇది మొదటిసారి ఏమి కాదు ఇలాంటివి చాలా ప్రదర్శనలను ఎన్నో చేశాడు .

ప్రపంచంలోని అందరి బౌలర్ల లాగ ఇతను కూడా 10 వికెట్ల ఫీట్ కోసం చాలానే ప్రయత్నించాడు.    2003-04 లో శ్రీకాంత్ అండర్ 19 ఆసియా  కప్ లో బాంగ్లాదేశ్ పైన 9 వికెట్లను తీసి 10 వికెట్లకు ఒక అడుగు దూరం లో ఉండిపోవాలిసి వచ్చింది. ఇంగ్లాండ్లో స్టోక్స్లీ క్రికెట్ క్లబ్ తరఫున శనివారం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ ప్రీమియర్ డివిజన్ లీగ్, నార్త్షోర్ సౌత్ డర్హామ్ (NYSE) క్రికెట్ లీగ్లో లీగ్ మ్యాచ్లో  మొత్తం పది వికెట్లను తీసి తన కలను  సాకారం చేసుకున్నాడు.

టైమ్స్ అఫ్ ఇండియా ప్రకారం  NYSD క్రికెట్ లీగ్ లో బలమైన జట్టుగా భావించే  మిడ్డిబ్రో క్రికెట్ క్లబ్ ,శ్రీకాంత్  అద్భుతమైన  ప్రదర్శనతో , క్లబ్ స్టోక్స్లీ  135 పరుగులతో  విజయం సాధించింది . పది వికెట్లు తీసుకొడంతో  పాటు శ్రీకాంత్  ఈ మ్యాచ్ లో బాటింగ్ లో కూడా రాణించి  కేవలం 28 బంతుల్లో, విలువైన 41 పరుగులు చేసాడు అందులో ఒక సిక్స్ ,నాలుగు ఫోర్లు  కూడా వున్నాయి.

స్టోక్స్లీ క్లబ్ ,తన ట్విట్టర్ ఖాతాలో స్కోర్ బోర్డు ని షేర్ చేస్తూ SEG పైన శ్రీకాంత్ పది వికెట్లు తీసుకోవడం ఒక అద్భుతమని అలాగే 25 పాయింట్లు రికార్డు ను కూడా   సాధించాడని పేర్కొంది . NYSD క్రికెట్ దాని ట్విట్టర్ హ్యాండిట్లో స్కోర్ కార్డును ట్వీట్ చేస్తూ ,స్టోక్స్లే  టీం శ్రీకాంత్ ను   ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది అని రాసింది.

స్టోక్స్లే ఆటగాడు డామ్స్ వీవెల్ తన సహచర ఆటగాడు వా, 10 వికెట్లు పడగొట్టడం వల్ల ఎంతో ప్రభావితుడు అయ్యాడు. మ్యాచ్ తరువాత, అతను ఇలా చెప్పాడు, “ఒక ఆటగాడు  మొదటి సారి 10 వికెట్లు తీయడం నేను ఇదే మొదటి సారిచూశాను. అతను మొదటి బంతి నుండి వేగంగా, స్వింగ్ మరియు సీమ్ బంతులను విసిరిరాడు. అతను మూడు ఓవర్లలో ఏడు వికెట్లు తీసుకున్నాడు. నేను అతని స్పెల్ యొక్క ప్రతి బంతిని రెండవ స్లిప్ వద్ద నుండి చూస్తున్నాను. నేను స్లిప్లో నిలబడి వుండడం మంచిది అయ్యింది ,బ్యాటింగ్ జట్టులో లేనని అని చాల ఆనందంగా ఫీల్ అయ్యాను . అతను అద్బుతమైన  స్పెల్ వేసాడు  మిస్టర్ శ్రీ కు నా అభినందనలు, అతను నిజంగా ఈ 10 వికెట్లకు అర్హుడు. “.

శ్రీకాంత్ వా NYSD లో  టాప్ బౌలర్. అతను 11.49 సగటుతో, 24.76 స్ట్రైక్ రేట్ తో  33 వికెట్లు తీసుకున్నాడు.

గత సంవత్సరం వరకు విదర్భ కోచ్ గా వున్న  సుబ్రోతో బెనర్జీ, శ్రీకాంత్గురించి ఇలా అన్నారు ” ఇలా రోజు జరగదు, ఇది నిజంగానే ఒక గొప్ప ఘనకార్యం ఏ ఆటైన , ఏ స్థాయిలో అయినా 10 వికెట్లు తీసుకోవడం చాల పెద్ద విషయం .  ఇది యావత్అ భారతదేశానికి ఎంతో గర్వకారణం,ఇంకా శ్రీకాంత ఇలాంటి రికార్డ్స్మ ని ఎన్నో సాదించడానికి మరింత కృషి చెయ్యాలని అన్నారు .బుల్దానా కి చెందిన 29 సంవత్సరాల శ్రీకాంత్ గాయలబారిని పడి ఒకనొక సమయంలో విదర్భ జట్టు లో తిరిగి స్థానం పొందడానికి ఎంతో ప్రయత్నాలు చేశాడు. ఏడు సంవత్సరాల క్రితం, అతను ఉమేష్ యాదవ్ తో పాటు విదర్భ నేతృత్వంలో మంచి ప్రదర్శన చేశాడు.

2005 వ సంవత్సరంలో శ్రీకాంత్ వా ఆటను ఆడటానికి వచ్చినప్పుడు, అతను జట్టులో భారత జట్టు పేసర్ ఇర్ఫాన్ పఠాన్ లాగా బౌలింగ్ చెయ్యడం వల్ల అందరి ద్రుష్టి అతనిపై పడింది. పఠాన్ మాదిరిగానే, బరోడా నుంచి వచ్చిన శ్రీకాంత్ తన ఎడమ చేతితో బౌలింగ్ చేస్తాడు. విదర్భ నుండి వచ్చిన శ్రీకాంత్, తను ఇర్ఫాన్ లాగానే మాదిరిగా కనపడడమే కాదు, ఇర్ఫాన్ మాదిరిగానే ఆడతాడని  నిరూపించాడు. ఇర్ఫాన్ లాగానే తను కూడా తక్కువేమీ కాదని  నిరూపించాడు.

SHARE