సౌత్ ఆఫ్రికా టూర్ లో తొలి రెండు టెస్టులు ఓడిపోయి బాగా దెబ్బ తిన్న భారత్ జట్టు, విరాట్ కోహ్లీ నేతృత్వంలో చక్కగా పుంజుకుంది. జొహ్యానెస్బర్గ్ లో జరిగిన ఆఖరి టెస్టులో తాము ప్రపంచ నెం. 1 జట్టు ఎందుకో నిరూపించుకున్నారు.

అయితే వన్ డే సిరీస్ ప్రారంభం నుంచి కోహ్లీ సేన వీరోచిత ప్రదర్శనలు, భారత్ అభిమానులను అబ్బుర పరిచాయి. తొలి వన్ డే లో క్లిష్టమైన డర్బన్ పిచ్ పై విరాట్ కోహ్లీ, అజింక్య రహానేలు భారత్ కు విజయాన్ని అందించారు.

Virat Kohli (captain) of India during the 2nd One Day International match between South Africa and India held at Supersport Park Cricket Ground in Centurion on the 4th Feb 2018
Photo by Ron Gaunt / BCCI / SPORTZPICS

కానీ రెండో వన్ డే లో స్పిన్ బౌలర్లు తమ మాయాజాలంతో సౌత్ ఆఫ్రికాను తమ సొంత గడ్డ పై అత్యంత గోరమైన బాటింగ్ చేసేలా చేసారు. కేవలం 32 ఓవర్లలో తొలుత బాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా ను 118 పరుగులకు అల్ అవుట్ చేసింది భారత్ జట్టు.

బాటింగ్ కు వచ్చిన భారత్, శిఖర్ ధావన్ మరియు విరాట్ కోహ్లీ అజేయ ఇన్నింగ్స్ లతో విజయాన్ని సులువుగా సాధించింది. గత 25 సంవత్సరాలు గా సౌత్ ఆఫ్రికా పర్యటన చేసిన భారత్ జట్టు, ఇప్పటి వరకు ఏ ఫార్మటు లో కూడా ఒక సిరీస్ గెలవకపోవడం తెలిసిందే.

కానీ ఇప్పుడు తొలి రెండు వన్ డే లు గెలిచినా తరువాత, కోహ్లీ సేన తమ తొలి సిరీస్ గెలుచుకునే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. రెండో వన్ డే గెలవడం తో విరాట్ కోహ్లీ కొన్ని కొత్త రికార్డులు నెల్కొలిపాడు.

రెండో వన్ డే గెలవడం తో విరాట్ కోహ్లీ, సౌత్ ఆఫ్రికా లో వరుసగా మూడు మ్యాచులు గెలిచినా తొలి భారత్ కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. అంతే కాకుండా వరుసగా రెండు వన్ డే మ్యాచులు గెలిచినా రెండో భారత్ కెప్టెన్ గా కూడా రికార్డు సాధించాడు.

ఇది వరకు ఎం ఎస్ ధోని నాయకత్వం లో భారత్ జట్టు 2011 ప్రపంచ కప్ కు ముందు సౌత్ ఆఫ్రికా పై వరుసగా రెండు వన్ డే విజయాలు సాధించింది. అయితే ఆ సిరీస్ ను 3-2 తో ఓడిపోయారు.

SHARE