శ్రీ లంక పై రెండో టెస్ట్ ఆడుతున్న భారత్ తుది జట్టు లో శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్ అందుబాటులో లేకపోవడంతో మార్పులు చేయాల్సివచ్చింది. నాగపూర్ వేదిక గా జరుగుతున్న టెస్టు మ్యాచ్ కు రోహిత్ శర్మ, మురళి విజయ్ మరియు గాయం పాలైన షమీ స్థానం లో ఇషాంత్ శర్మ చోటు దక్కించుకున్నారు.

టాస్ గెలిచి బాటింగ్ ఎంచుకున్న శ్రీలంక ఓపెనర్ కరుణ రత్నే ఇచ్చిన చక్కటి ఆరంభం తో బాగానే ప్రారంభించింది. అయితే ఇషాంత్ శర్మ, అశ్విన్ మరియు జడేజా చక్కటి ప్రదర్శనలతో లంక ను కేవలం 205 పరుగులకే కట్టడి చేసారు.

ఇషాంత్ శర్మ 3 వికెట్లు, రవీంద్ర జడేజా 3 వికెట్లు తీయగా రవిచంద్రన్ అశ్విన్ మాత్రం 4 వికెట్లు చేజేకించున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది.

రోజు మొత్తం క్రికెట్ లో భారత్ పైచేయి చూపించగా, జట్టు లోకి వచ్చిన రోహిత్ శర్మ తన శైలి తో 11 ఓవర్లో స్పైడర్ కామ్ తో ఆడుకోవడం అందరిని అబ్బురపరిచింది.

టెక్నాలజీ పెరిగిన ఈ కాలం లో మ్యాచ్ ను ప్రేక్షకులకు మరించ అందంగా చూపించేందుకు స్పైడర్ కామ్ ను ఉపయోగిస్తున్నారు. అయితే చాలా ఈ చిట్టి యంత్రం వాళ్ళ క్యాచ్ లు, సిక్స్ లు ఆగిపోవడం చూస్తూనే ఉన్నాం.

శ్రీలంక బాటింగ్ చేసేటప్పుడు కిందకి వచ్చిన స్పైడర్ కామ్ చుసిన రోహిత్ శర్మ, తొలుత కెమెరాకు అడ్డం గా నిలబడిన హిట్ మాన్, తర్వాత పైకి వెళ్తున్న స్పైడర్ కామ్ ను పట్టుకునేందుకు ప్రయత్నించాడు.

ఈ వీడియో ను భారత్ క్రికెట్ జట్టు సోషల్ మీడియా అకౌంట్ జనాలకు షేర్ చేయగా, బాగా పాపులర్ అయింది.

ఆ వీడియో మీరే చూడండి

What’s up Hitman? @rohitsharma45

A post shared by Team India (@indiancricketteam) on

SHARE