ఇటీవలే శ్రీలంక పై జరిగిన మూడు మ్యాచ్ ల వన్ డే సిరీస్ లో రోహిత్ శర్మ డబుల్ సెంచరీ సాధించడం తో, తాజా గా విడుదలైన వన్ డే ర్యాంకింగ్స్ లో టాప్ 5 లో చోటు సంపాదించాడు.

ధర్మశాల లో తొలి మ్యాచ్ ఓడిపోయిన భారత్ జట్టును, కెప్టెన్ రోహిత్ శర్మ తనదైన రీతిలో ముందుడి రెండో వన్ డే లో ద్విశతకం తో నడిపించాడు. ఆదివారం విశాఖపట్నం లో జరిగిన మూడో వన్ డే లో భారత్ రాణించడం తో అలవోక గా సిరీస్ ను గెలుచుకున్నారు.

Rohit Sharma Captain of India celebrates his Two Hundred runs during the 2nd One Day International between India and Sri Lanka held at the The Punjab Cricket Association IS Bindra Stadium, Mohali on the 13 December 2017
Photo by Deepak Malik / BCCI / Sportzpics

మొహాలీ లో జరిగిన రెండో వన్ డే అజేయ డబుల్ సెంచరీ సాధించిన రోహిత్ శర్మ, ఏడో స్థానం నుండి ఐదో స్థానానికి ఎగబాకాడు. అలానే తన కెరీర్ లో మొట్ట మొదటి సారి 800 రేటింగ్ పాయింట్ల మార్కును దాటాడు. తన కెరీర్ లో మూడో స్థానం లో కూడా ఉన్న రోహిత్ శర్మ, ఈ సారి 800 పాయింట్లు దాటడం గమనార్హం.

రోహిత్ శర్మ ఓపెనింగ్ పార్టనర్ శిఖర్ ధావన్ కూడా తన ప్రతిభ మళ్ళీ చూపించి మాన్ అఫ్ ది సిరీస్ అవార్డు గెలిచాడు. సిరీస్ లో 168 చేసిన ధావన్, ఒక స్థానం మెరుగుపరుచుకుని 14 వ స్థానానికి చేరాడు.

Shikhar Dhawan of India celebrates his Hundred runs during the 3rd One Day International between India and Sri Lanka held at the The ACA-VDCA Stadium, Visakhapatnam on the 17 December 2017
Photo by Deepak Malik / BCCI / Sportzpics

బౌలర్లు కూడా చక్కగా రాణించడం తో వారి ర్యాంకింగ్ లో మంచి అభివృద్ధి సాధించారు. స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ 23 స్థానాలు పైకి వెళ్లి 28 వ స్థానం సాధించగా, యువ స్పిన్ మాంత్రికుడు కుల్దీప్ యాదవ్ 16 స్థానాలు ఎగబాకి కెరీర్ లోనే అత్యుత్తమైన 56 వ స్థానం కైవసం చేసుకున్నాడు.

ఈ స్పిన్ ద్వయం భారత్ సిరీస్ విజయం లో చాలా కీలక పాత్ర పోషించగా, అల్ రౌండర్ హార్దిక్ పాండ్య కూడా 10 స్థానాలు మెరుగుపరుచుకుని 45 వ స్థానం దక్కించుకున్నాడు.

శ్రీలంక పై టెస్టు మరియు వన్ డే సిరీస్ లు కైవసం చేసుకున్న భారత్ జట్టు, ఈ బుధవారం మొదలుకానున్న టీ 20 సిరీస్ ను కూడా గెలిచి మరో సారి క్లీన్ స్వీప్ చేయాలనీ ఊవిళ్లురుతున్నారు.

SHARE