Credits: BCCI

కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు ఢీలా పడింది. ఆదివారం టేబుల్ ఆఖరి స్థానంలో ఉన్న ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు తమ స్థాయికి తగినట్టు రాణించకపోవడంతో పరాజయం పాలైంది.

ఈ పరాజయంతో వారు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్ దశకు  క్వాలిఫై ఇవ్వలేకపోయారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టు తొలి అయిదు ఓవర్లలోనే ఓపెనర్లు ప్రతి పృథ్వీ షా మరియు గ్లాన్ మాక్స్వెల్ వికెట్లను కోల్పోయింది.

తర్వాత బ్యాటింగ్కు వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు . సిక్స్ కొట్టే ప్రయత్నంలో మిడ్ వికెట్ దగ్గర క్యాచ్ అవుటయ్యాడు. కానీ మంచి ఫామ్లో ఉన్న వికెట్ కీపర్ రిషబ్ పంత్, మరో యువ ఆల్ రౌండర్ విజయ్ శంకర్ తో కలిసి జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు.

Photo Credit: IPL.

ఈ ఏడాది తన సత్తా చాటిన పంత్ మరోసారి కేవలం 44 బంతుల్లో 64 పరుగులు చేసి ముంబయి బౌలర్లకు చెమటలు పట్టించాడు. అతను అవుట్ అయిన తర్వాత వచ్చిన అభిషేక్ శర్మ కూడా వేగంగా పరుగులు చేయడంతో ఢిల్లీ జట్టు 20 నిర్ణీత ఓవర్లలో  4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.

175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ తొలి ఓవర్లోనే సూర్యకుమార్ రూపంలో తొలి వికెట్ను కోల్పోయారు. తరువాత మరో ఓపెనర్ ఏళ్లు ఎస్ ఎదురు దాడికి దిగడంతో ఢిల్లీ బౌలర్లు పరుగులు ఆపడానికి చాలా కష్టపడ్డారు.

ఏడు వ ఓవర్లో కిషన్ కిషన్ అవుట్ కావడంతో ముంబయి జట్టు పతనం ప్రారంభమైంది. తరువాత ఢిల్లీ జట్టు వరుస బంతుల్లో ఎవిల్ లూయిస్ , కీరన్ పోలార్డ్ వికెట్లు తీసి మ్యాచ్ పై మంచి పట్టు సాధించింది. క్రునాల్ పాండ్యా, రోహిత్ శర్మ ఇద్దరూ మరోసారి నిరాశ పరచడంతో ముంబాయి జట్టు మరింత కష్టాల్లో కూరుకుపోయింది.

చివరిలో హార్దిక్ ఫండ్గా కాస్త పర్వాలేదనిపించినా అతను అవుటయిన తర్వాత ముంబై జట్టు ఆశలు గల్లంతయ్యాయి. కానీ ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ బెన్ కటింగ్ మరోసారి తన సంచలన హిట్టింగ్తో జట్టును విజయానికి చాలా దగ్గరగా తీసుకువెళ్లాడు. అయితే అతనికి సరైన సహకారం లభించకపోవడంతో ముంబై జట్టు చివరికి పదకొండు పరుగుల తేడాతో ముఖ్యమైన విజయంలో ఓటమి చవిచూసింది.

SHARE