భారత క్రికెట్ జట్టు కోచ్ రవి శాస్త్రి తన మొదటి దఫా జీతం బీసీసీఐ నుంచి పొందారు. ఆయన అక్షరాలా 1,20,87,187 రూపాయలు తీసుకున్నారు కానీ ఈ మొత్తం అనిల్ కుంబ్లే కంటే తక్కువ కావడం విశేషం.

బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు మరియు భారత్ క్రికెట్ జట్టు కోచ్ పదవి మొత్తం క్రీడాలోనే చాలా విలువైన స్థానం. అనిల్ కుంబ్లేతో కెప్టెన్ విరాట్ కోహ్లీకీ మనస్పరాధాలు వచ్చాక దిగ్గజ స్పిన్నర్ ను పదవి నుంచి తప్పించి శాస్త్రి ని నియమించిన విషయం అందరికి తెల్సిందే.

పూర్వము వచ్చిన వార్తల ప్రకారం, శాస్త్రికీ కుంబ్లే కంటే ఎక్కువ జీతం ఇచ్చారు అని వచ్చిన వార్త అందరికి తెల్సిందే. ఐతే బీసీసీఐ తమ వెబ్సైటు లో పెట్టిన వివరాల ప్రకారం, కుంబ్లే ఇంకా ప్రపంచంలో అత్యంత చెల్లింపు తీసుకున్న కోచ్ గా ఉన్నారు.

భారత్ కూడా కుంబ్లే-కోహ్లీ నాయకత్వం లో చక్కటి ప్రదర్శనలు చేస్తున్నారు. ఇటీవల శ్రీ లంక లో టెస్ట్, ఒన్డే మరియు టీ 20 సిరీస్ లను క్లీన్ స్వీప్ చేసి తమ ప్రతిభను కనపరిచారు. ఇప్పుడే మొదలైన ఆస్ట్రేలియా సిరీస్ లో కూడా తమదైన ముద్ర వేసి 4 – 1 తో చాలా సులువుగా గెలిచి నెం.1 స్థానం మళ్ళీ చేజిక్కిన్చుకున్నారు.

శాస్త్రి పూర్వము 2014 నుంచి 2016 వరకు టీం డైరెక్టర్ గా పనిచేసారు కానీ ఈ సంవత్సరం పూర్తి స్థాయి కోచ్ బాధ్యతలు తీస్కున్నారు. 2019 ప్రపంచ కప్ వరకు ఆయన అదే స్థానం లో కొనసాగుతారు.