న్యూఢిల్లీ: భారత మహిళా క్రికెట్ జట్టు తాత్కాలిక కోచ్‌గా మాజీ స్పిన్నర్ రమేశ్ పవార్‌ను బీసీసీఐ నియమించింది. ఇటీవల భారత మహిళా క్రికెట్ జట్టు కోచ్‌గా పనిచేసిన తుషార్ అరోథి గుడ్‌బై చెప్పిన నేపథ్యంలో పవార్‌కు తాత్కాలిక కోచ్ బాధ్యతలు అప్పగించింది. దీనిలో భాగంగా మహిళా క్రికెట్‌ జట్టు అసిస్టెంట్‌ కోచ్‌ బిజూ జార్జ్‌తో కలిసి పవార్‌ పని చేసేందుకు రంగం సిద్దమైంది.  జూలై 25 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకూ బెంగళూరులో జరిగే భారత మహిళా క్రికెట్‌ జట్టు శిక్షణా శిబిరంలో పవార్‌ పాల్గొనున్నాడు. ఈ క‍్రమంలోనే పవార్‌కు తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు అ‍ప్పజెప్పినట్లు సమాచారం.పూర్తిస్థాయి కోచ్ నియామకానికి మరికొంత సమయం పట్టొచ్చని భావించిన బీసీసీఐ, రమేశ్ పవార్‌ను తాత్కాలిక కోచ్‌గా నియమించింది. 40ఏళ్ల పవార్ భారత్ జట్టు తరపున రెంటు టెస్టు మ్యాచ్‌ల్లో పాల్గొని ఆరు వికెట్లు తీశాడు. అంతర్జాతీయ వనే్డ క్రికెట్‌లో 31 మ్యాచ్‌ల్లో 34 వికెట్లు తీశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 148 మ్యాచ్‌ల్లో 470 వికెట్లు తీసి అంతర్జాతీయ గుర్తింపు పొందాడు.

ఇప్పటికే మహిళా క్రికెట్‌ కోచ్‌ పదవికి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దరఖాస్తులు స్వీకరించడానికి  ఆఖరి తేదీ జూలై 20. దరఖాస్తు చేసుకునే వ్యక్తికి జాతీయ స్థాయిలో క్రికెట్‌ ఆడిన అనుభవంతో పాటు 55 ఏళ్లలోపు వయసు కలిగి ఉండాలి. ఈ విషయాన్ని బీసీసీఐ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.  అయితే కోచ్‌ను ఎంపిక చేసేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున పవార్‌ను తాత్కాలిక కోచ్‌గా నియమించినట్లు తెలుస్తోంది.

దీనికి సంభందించి బిసిసిఐ తన వెబ్సైటు లో కొన్ని మార్గదర్శకాలను పొందుపరిచింది:

కీలక బాధ్యతలు:

# బలమైన మహిళా జాతీయ జట్టును నిర్మించటం

# జట్టు మానేజ్మెంట్ ను వ్యూహాత్మక దిశలో నడపడం

# మహిళల క్రికెట్ కోచింగ్ సెట్ అప్ ను అభివృద్ధి చెయ్యడం

# మహిళల క్రికెట్ సంబంధిత అన్ని విషయాలపై పొజిషన్ పేపర్స్ పై అభివృద్ధి చెయ్యడం

#జాతీయస్థాయి టీంతో కలిసి  NCA యొక్క ఫిట్నెస్,అధిక పనితీరు సమితి ప్రమాణాల సమ్మతిని నిర్ణయించడం అలాగే పర్యవేక్షించడం

# NCA అధ్బుత ప్రదర్శన తో ఫిట్నెస్ యొక్క సమితి ప్రమాణాల సమ్మతిని నిర్ధారించడం మరియు పర్యవేక్షించడం.

# రానున్న NCA ప్రాంగణంలో క్రికెటింగ్ సౌకర్యాన్ని పర్యవేక్షించాలి

# కోచెస్ , అధ్యాపకుల కోసం విద్యా కార్యక్రమాలు / మార్గదర్శకాలు

అర్హత :

# అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి ఉండాలి,లేదా

# NCA లెవల్ ‘సి’ సర్టిఫికేట్ కోచ్ లేదా ప్రముఖ సంస్థ / ఇన్స్టిట్యూట్ నుండి ఇదే సర్టిఫికేషన్ ను కలిగి ఉండాలి ,లేదా

# NCA లెవెల్ B లేదా కనీసం 50 ఫస్ట్ క్లాసు  గేమ్స్ తో ఒక ప్రముఖ సంస్థ / ఇన్స్టిట్యూట్ నుండి ఇదే సర్టిఫికేషన్ ను కలిగి ఉండాలి

అనుభవం :

# జాతీయ జట్టు లేదా ఫస్ట్-క్లాస్ స్టేట్ కి  టీం కోచింగ్ చేసిన  అనుభవం ఉండాలి.

నాలెడ్జ్ మరియు నైపుణ్యాలు:

# అత్యధిక స్థాయిలో గేమ్ లేదా శిక్షణ / కోచింగ్ అనుభవాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవడం

# బహుళ సాంస్కృతిక మాధ్యమం నుండి వచ్చిన  బృందాని అర్థం చేసుకోవడంలో అనుభవం

#టీం వర్క్ – వ్యాపారం మరియు విభాగ లక్ష్యాలను సాధించడంలో ఇతరులతో సహకరించాలి

# సమస్య పరిష్కారం- పరిష్కారాలను సమర్ధించే సామర్థ్యం ఒత్తిడికి సంబంధించి ఉత్తమ నిర్ణయం తీసుకోవడంలో సమర్ధత

# కమ్యూనికేషన్ – ఆంగ్ల భాషలో అద్భుతమైన వ్రాత అలాగే ఓరల్ కమ్యునికేషన్ తో బాటు నివేదిక వ్రాయడంలో నైపుణ్యం కలిగి ఉండాలి

# టైమ్ మేనేజ్మెంట్- అద్భుతమైన సమయం నిర్వహణ నైపుణ్యాలు, బహుళ-విధి నిర్వహణ మరియు గడువులో పని చేసే సామర్థ్యం.

 

 

SHARE