టెస్ట్ క్రికెట్లో సెంచరీ కొట్టడమే చాలా గొప్ప విషయం. అలాంటిది డబుల్ సెంచరీ సాధిస్తే ఆ బాట్స్మన్ ఆ రికార్డు ను మరిచిపోడు.

అయితే వరుస ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ అనేది అంత మాములుగా జరిగే విషయం. కానీ 140 ఏళ్ళ క్రికెట్ చరిత్రలో కేవలం ఆరుగురు బాట్స్మన్ మాత్రమే ఈ ఫీట్ ను సాధించారు.

#1. వాలీ హమొండ్

Gloucestershire and England cricketer Wally Hammond, circa 1938. (Photo by Popperfoto/Getty Images)

ఇంగ్లాండ్ ఆటగాడు వాలీ హమొండ్ 1920 లు, 1930 ల్లో ప్రపంచం లోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. ఆయన మాత్రమే ఈ ఫీట్ రెండు సార్లు సాధించాడు.

1928 లో ఆస్ట్రేలియా పై ఆస్ట్రేలియా లో ఆడిన యాషెస్ సిరీస్ ఆయన మొదటి సరి ఈ రికార్డు సాధించగా, 1933 లో న్యూజిలాండ్ పై మరో సారి వరుస డబుల్ సెంచరీలు సాధించాడు.