తిరువనంతపురం తో భారత్ జట్టు సాధించిన విజయం తో అగ్ర ర్యాంకు లో ఉన్న న్యూజిలాండ్ రెండో స్థానానికి పడిపోయింది. 2 -1 తో సిరీస్ భారత్ గెలుచుకోవడం తో పాకిస్తాన్ నెం . 1 ర్యాంక్ సాధించింది.

సిరీస్ కు ముందు 125 రేటింగ్ పాయింట్లు ఉన్న న్యూజిలాండ్, భారత్ తో సిరీస్ ఓడిపోవడం తో 120 రేటింగ్ పాయింట్స్ తో రెండో స్థానం చేజేకించుకుంది. అయితే సిరీస్ గెలిచినా భారత్ మాత్రం ఉన్న 5 వ స్థానాన్ని నిలబెట్టుకుంది. అయితే సిరీస్ కు ముందు 116 రేటింగ్ పాయింట్లు ఉన్న భారత్, 2 -1 విజయం తో 119 రేటింగ్ పాయింట్స్ సాధించింది.

తొలి మ్యాచ్ ఓడిపోయాక నెం. 1 స్థానం కోల్పోయిన న్యూజిలాండ్, రెండో టీ 20 గెలిచి మరల మొదటి స్థానం చేజేకించుకుంది, కానీ సిరీస్ కోల్పోయి మరల తమ స్థానాన్ని పాకిస్తాన్ కు కట్టబెట్టింది.

ఆఖరి టీ 20 లో న్యూజిలాండ్ చాలా చక్కగా ఆడినప్పటికీ భారత్ జట్టు తమ మెరుగైన బౌలింగ్, ఫీల్డింగ్ తో కేవలం 6 పరుగులతో మ్యాచ్ ను గెలిచారు. తొలుత బాటింగ్ చేసి 67 పరుగులు చేసిన భారత్, 8 ఓవర్లలో న్యూజిలాండ్ ను 61 పరుగులకే కట్టడి చేసి అద్భుత విజయం సాధించింది.

బాట్స్మన్ ర్యాంకు లలో విరాట్ కోహ్లీ తొలి స్థానం లో కొనసాగుతుండగా, బౌలింగ్ ర్యాంకు లలో జాస్ప్రయ్త్ బుమ్రా తన తొలి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

వచ్చే నెల శ్రీ లంక తో 3 మ్యాచ్ ల టీ 20 సిరీస్ ఆడబోతున్న భారత్, మరో సిరీస్ విజయం సాధిస్తే రెండో స్థానానికి వెళ్లే అవకాశం ఉంది.

తాజా గా విడుదలయిన జట్టు ర్యాంకులు

ర్యాంకు జట్టు మ్యాచ్లు పాయింట్లు రేటింగ్
1 పాకిస్తాన్ 23 2843 124
2 న్యూజిలాండ్ 16 1925 120
3 వెస్ట్ ఇండీస్ 20 2395 120
4 ఇంగ్లాండ్ 17 2029 119
5 భారత్ 25 2965 119
6 సౌత్ ఆఫ్రికా 20 2238 112
7 ఆస్ట్రేలియా 15 1665 111
7 శ్రీలంక 24 2177 91
9 ఆఫ్గనిస్తాన్ 25 2157 86
10 బాంగ్లాదేశ్ 17 1289 76
SHARE