ఆదివారం జరిగిన నిదాహస్ ట్రోఫీ ఫైనల్ ను భారత్ సంచలనంగా గెలిచింది. దినేష్ కార్తీక్ ఆఖరి బంతికి సిక్స్ సాధించి, భారత్ కు మర్చిపోలేని విజయాన్ని తెచ్చిపెట్టాడు. ఆఖరి రెండు ఓవర్లలో 34 పరుగులు కావాల్సిన స్థితిలో బాటింగ్ కు వచ్చిన కార్తీక్, 9 బంతుల్లో అజేయ 28 పరుగులు చేసాడు.

తొలుత టాస్ ఒడి బాటింగ్ చేసిన బాంగ్లాదేశ్, నిర్ణిత 20 ఓవర్లలో 166 పరుగులు చేసింది. షబ్బీర్ రెహమాన్ అద్భుతంగా ఆడి ఆ స్కోరును అందించగా, చేజింగ్ లో భారత్ కు రోహిత్ శర్మ అద్భుత ఓపెనింగ్ ఇచ్చాడు, ఐతే దినేష్ కార్తీక్ చివర్లో మెరుపులు మెరిపించి భారత్ కు విజయం చేకూర్చాడు.

ఐతే ఈ విజయం లో ఎన్నో రికార్డులు బద్దలు అయ్యాయి. అవి ఏంటో మీరే చూడండి

  • టీ 20 ఫైనల్స్ మూడు గెలిచినా తొలి జట్టు గా భారత్ క్రికెట్ జట్టు రికార్డు సృష్టించింది
  • టీ 20 క్రికెట్ లో 7000 పరుగులు సాధించిన మూడో భారత్ బాట్స్మన్ అయ్యాడు- రోహిత్ శర్మ
  • బాంగ్లాదేశ్ క్రికెటర్ మహ్మదుల్లా, అంతర్జాతీయ టీ 20 ల్లో 1000 పరుగులు చేసిన నాలుగో బంగ్లా క్రికెటర్ అయ్యాడు. అతని కంటే ముందు తమీమ్ ఇక్బాల్, షకీబ్ అల్ హాసన్ మరియు ముషఫీకూర్ రహీమ్ ఈ మైలురాయిని అందుకున్నారు.
  • ఒక టీ 20 ఫైనల్ లో అర్ధ శతకం సాధించిన నాలుగో కెప్టెన్ గా రోహిత్ శర్మ రికార్డు సాధించాడు.

  • మహ్మదుల్లా ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ 20 ల్లో ఎనిమిది సార్లు రన్ అవుట్ అయ్యాడు. అత్యంత ఎక్కువ సార్లు రన్ అవుట్ అయ్యిన ఆటగాడిగా కనే విల్లియంసన్ మరియు షెన్వారీ సరసన చేరాడు.
  • బాంగ్లాదేశ్ పై ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది టీ 20 లను భారత్ గెలిచింది.
  • అంతర్జాతీయ టీ 20 ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్లలో భారత్ రెండో స్థానం (60) కైవసం చేసుకుంది. తొలి స్థానంలో పాకిస్తాన్ 74 విజయాలు సాధించింది.
  • అంతర్జాతీయ టీ 20 ల్లో 500 పరుగులు చేరుకోవడానికి కే ఎల్ రాహుల్ కు కేవలం 13 ఇన్నింగ్స్ పట్టింది. ఇది మరో సరికొత్త ప్రపంచ రికార్డు.
  • రోహిత్ శర్మ తన కెరీర్ లో 16 వ 50 + స్కోర్ సాధించాడు. కేవలం విరాట్ కోహ్లీ మాత్రమే 18 50+ స్కోర్లు సాధించాడు.
  • భారత్ ఛేదించిన 167 పరుగులే ఇప్పటి వరకు ఒక టీ 20 ఫైనల్ లో హైయెస్ట్ రన్ చేజ్. ఇప్పటి వరకు ఆ రికార్డు వెస్ట్ ఇండీస్ ఇంగ్లాండ్ పై కోల్ కతా లో సాధించిన 156 పరుగులు.
SHARE