సౌత్ ఆఫ్రికా పై సంచలన విజయాలు నమోదు చేసిన భారత్ క్రికెట్ జట్టు, ఐపీఎల్ కు ముందు శ్రీలంక లో జరగనున్న ముక్కోణపు టీ 20 సిరీస్ లో పాల్గొనుంది. సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి కలిపించిన సెలెక్టర్లు, యువ క్రికెటర్లకు అవకాశాన్ని కలిపించారు.

రోహిత్ శర్మ నేతృత్వంలో ఆడనున్న భారత్, మార్చ్ 6 న శ్రీలంకపై తొలి టీ 20 ఆడనున్నారు. అయితే చాలా మంది యువ క్రికెటర్లు ఉండటంతో తుది జట్టు ఎలా ఉండవచో ఇక్కడ చూద్దాం.

రోహిత్ శర్మ

సౌత్ ఆఫ్రికా పర్యటనలో పెద్దగా రాణించనప్పటికీ సెలెక్టర్లు రోహిత్ ను కెప్టెన్ గా ప్రకటించారు. అయితే శ్రీలంక పై మంచి రికార్డు ఉన్న రోహిత్, మరో సారి ఓపెనర్ గా బరిలోకి దిగటం కచ్చితం.

శిఖర్ ధావన్

Shikhar Dhawan of India celebrates his Hundred runs during the 3rd One Day International between India and Sri Lanka held at the The ACA-VDCA Stadium, Visakhapatnam on the 17 December 2017
Photo by Deepak Malik / BCCI / Sportzpics

ఓపెనర్ గా మంచి ఫామ్ లో ఉన్న శిఖర్ ధావన్, సౌత్ ఆఫ్రికా సిరీస్ లో తన వీరోచిత ఫామ్ ను కనబరిచాడు. విరాట్ కోహ్లీ కు చక్కటి సహకారం అందిస్తూ 300 పైగా పరుగులు కేవలం వన్డే సిరీస్ లోనే సాధించాడు.

సురేష్ రైనా

సౌత్ ఆఫ్రికా పై ఇటీవలే జరిగిన టీ 20 సిరీస్ లో తిరిగి జట్టులోకి వచ్చిన సురేష్ రైనా, తన సెలక్షన్ కు న్యాయం చేసాడు. చివరి టీ 20 లో మాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు సాధించాడు రైనా. మరో సారి అదే విధంగా ఆడి వన్డే జట్టులో కూడా స్థానం సాధించాలని చూస్తున్నాడు.

మనీష్ పాండే

సౌత్ ఆఫ్రికా లో జరిగిన తొలి టీ 20 లో అంతగా రాణించని మనీష్ పాండే, రెండో టీ 20 లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఐతే ఈ ముక్కోణపు సిరీస్ లో మరో సారి జట్టులో తన చోటును పదిలం చేసుకుందుకు చూస్తున్నాడు.

కే ఎల్ రాహుల్

సౌత్ ఆఫ్రికా సిరీస్ లో తుది జట్టులో స్థానం సాధించలేకపోయిన కే ఎల్ రాహుల్, తాను డిసెంబర్ లో శ్రీలంక పై కనబరిచిన ఫామ్ ను పునరావృతం చేసే ఆలోచనలో ఉన్నాడు.

రిషబ్ పంత్

ఇటీవలే దేశావళి క్రికెట్లో మంచి ఫామ్ తో దూసుకుపోతున్న రిషబ్ పంత్ కు సెలెక్టర్లు తమ ఓటు వేశారు. ధోని విశ్రాంతి కోరడంతో దినేష్ కార్తీక్ ఉన్న సరే, పంత్ కే తుది జట్టులో స్థానం దొరకనుంది.

దీపక్ హుడా

Deepak Hooda of Sunrisers Hyderabad plays a delivery behind towards the boundary during match 42 of the Vivo IPL 2016 (Indian Premier League) between the Sunrisers Hyderabad and the Delhi Daredevils held at the Rajiv Gandhi Intl. Cricket Stadium, Hyderabad on the 12th May 2016
Photo by Shaun Roy / IPL/ SPORTZPICS

మంచి దేశవాళీ సీజన్ నుండి ఐపీఎల్ కు సన్నధం అవుతున్న దీపక్ హుడాకు తొలి సారి భారత్ జట్టులో స్థానం దక్కింది. ఐతే మంచి ఫినిషింగ్ స్కిల్స్ కలిగి ఉండటంతో ఏడో నెంబర్ లో బరిలోకి దిగటం ఖాయం గా కనిపిస్తుంది.

అక్సర్ పటేల్

కుల్దీప్ యాదవ్ కు ఈ సిరీస్ కు విశ్రాంతి కలిపించడంతో అక్సర్ పటేల్ తుది జట్టులో స్థానం సాధించడం ఖాయం గా కనిపిస్తుంది. అయితే సౌత్ ఆఫ్రికా పై జరిగిన ఆఖరి టీ 20 లో అంతగా ప్రభావం చూపని ఈ స్పిన్నర్, ఈ సిరీస్ లో ఏమి చేస్తాడో చూడాలి.

శార్దూల ఠాకూర్

ఇటీవలే భారత్ జట్టులో మంచి అవకాశాలు సాధిస్తున్న పేస్ బౌలర్ శార్దూల ఠాకూర్. అయితే ఇంకా భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా లా స్థాయికి చేరని ఈ యువ బౌలర్, ఈ సిరీస్ ద్వారా మరో సారి తన సత్తా చాటాలనుకుంటున్నాడు.

యుజ్వేంద్ర చాహల్

సౌత్ ఆఫ్రికా పై వన్డే సిరీస్ లో అద్భుతంగా ఆడిన యుజ్వేంద్ర చాహల్, టీ 20 సిరీస్ అదే రీతిలో ఆడలేకపోయాడు. రెండో టీ 20 లో 4 ఓవర్లలో 64 పరుగులు ఇచ్చి ఆఖరి టీ 20 జట్టులో స్థానం కోల్పోయాడు.

జయదేవ్ ఉనాద్కట్

India’s Jaydev Unadkat celebrates the dismissal of Sri Lanka’s Niroshan Dickwella during their second Twenty20 international cricket match in Indore, India, Friday, Dec. 22, 2017. (AP Photo/Rajanish Kakade)

డెత్ ఓవర్ స్పెషలిస్ట్ గా మంచి పేరు సాధిస్తున్న జయదేవ్ ఉనాద్కట్, జస్ప్రీత్ బుమ్రా లేని జట్టులో చివరి ఓవర్లలో చాలా ముఖ్య పాత్ర పోషించనున్నారు.

SHARE