ప్రస్తుతం ప్రారంభమైన నిదాహస్ ట్రోఫీ లో తొలి మ్యాచ్ లో శ్రీలంక చేతిలో కంగుతిన్న రోహిత్ సేన, రెండో టీ 20 లో భాగంగా బంగ్లాదేశ్ పై గురువారం ఆడనున్నారు. అయితే శ్రీలంక పై ఓటమితో భారత్ జట్టు లో యువ క్రికెటర్లు తమ స్థాయి తగ్గ ప్రదర్శనలు చేయాల్సి ఉంది.

తొలి మ్యాచ్ లో మిడిల్ ఆర్డర్ సరిగా రాణించకపోగా, రోహిత్ శర్మ మరియు సురేష్ రైనా కూడా నిరాశపరిచారు. అయితే చాలా మంది యువ క్రికెటర్లు ఉండటంతో తుది జట్టు ఎలా ఉండవచో ఇక్కడ చూద్దాం.

రోహిత్ శర్మ

సౌత్ ఆఫ్రికా పర్యటనలో పెద్దగా రాణించనప్పటికీ సెలెక్టర్లు రోహిత్ ను కెప్టెన్ గా ప్రకటించారు. అయితే తొలి మ్యాచ్ లో మరో సారి విఫలం అయినా రోహిత్, బంగ్లాదేశ్ పై మరో సారి కెప్టెన్ గా బరిలోకి దిగటం కచ్చితం.

శిఖర్ ధావన్

ఓపెనర్ గా మంచి ఫామ్ లో ఉన్న శిఖర్ ధావన్, సౌత్ ఆఫ్రికా సిరీస్ లో తన వీరోచిత ఫామ్ ను కనబరిచాడు. అదే స్థాయిలో తొలి టీ 20 లో కూడా 49 బంతుల్లో 90 పరుగులు సాధించాడు.

సురేష్ రైనా

సౌత్ ఆఫ్రికా పై ఇటీవలే జరిగిన టీ 20 సిరీస్ లో తిరిగి జట్టులోకి వచ్చిన సురేష్ రైనా, తన సెలక్షన్ కు న్యాయం చేసాడు. చివరి టీ 20 లో మాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు సాధించాడు రైనా. కానీ శ్రీలంక పై విఫలం అయినా రైనా, మిడిల్ ఆర్డర్ లో ఉన్న అత్యంత కీలక బాట్స్మెన్.

మనీష్ పాండే

నిలకడలేమి తో సతమతవుతున్న మనీష్ పాండే, మరో సారి శ్రీలంక పై చాలా మెల్లగా పరుగులు చేసాడు. 35 బంతుల్లో 37 పరుగులు చేసిన పాండే, ఈ సారి మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించక తప్పదు.

రిషబ్ పంత్

ఇటీవలే దేశావళి క్రికెట్లో మంచి ఫామ్ తో దూసుకుపోతున్న రిషబ్ పంత్ కు సెలెక్టర్లు తమ ఓటు వేశారు. కానీ శ్రీలంక పై ఆఖరి ఓవర్లలో తన దూకుడు చూపలేకపోయాడు ఈ యువ కిరణం.

దినేష్ కార్తీక్ 

India’s Dinesh Karthik celebrate scoring half a century against West Indies in his partnership with captain India’s captain Virat Kohli during the fifth ODI at the Sabina Park cricket ground in Kingston, Jamaica, Thursday, July 6, 2017. India won the match by 8 wickets and the series 3-1.(AP Photo/Ricardo Mazalan)

తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్న దినేష్ కార్తీక్, మరో సారి భారత్ స్లొగ్ హిట్టర్ గా ఎంపిక అవుతాడు. శ్రీలంక పై జరిగిన టీ 20 లో కేవలం 6 బంతుల్లో 13 పరుగులు చేసాడు.

వాషింగ్టన్ సుందర్

భారత్ క్రికెట్ లో సెలెక్టర్లు నమ్ముతున్నా మరో యువ క్రికెటర్ వాషింగ్టన్ సుందర్. తన పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్న సుందర్, శ్రీలంక పై కేవలం 28 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసాడు.

విజయ్ శంకర్

దేశవాళీ క్రికెట్ లో చక్కగా ఆడుతూ అల్ రౌండర్ గా మంచి పేరు సాధించిన విజయ్ శంకర్, శ్రీలంక పై తన భారత్ అరంగ్రేటం చేసాడు. అయితే బాట్ తో అవకాశం రాకపోగా, బంతితో పర్వాలేదు అనిపించాడు.

యుజ్వేంద్ర చాహల్

వన్డేల్లో తన స్థానాన్ని పదిలం చేసుకున్న యుజ్వేంద్ర చాహల్, అదే రీతిలో టీ 20 ల్లో ఆడలేకపోతున్నాడు. శ్రీలంక పై రెండు వికెట్లు తీసినప్పటికి పరుగులను మాత్రం కట్టడి చేయలేకపోయాడు.

మహమ్మద్ సిరాజ్

అంతర్జాతీయ క్రికెట్ లో ఇప్పటి వరకు నిలకడలేమితో సతమతమైన మహమ్మద్ సిరాజ్ కు మరో అవకాశం బంగ్లా టైగెర్స్ మ్యాచ్. శ్రీలంక పై ధారాళంగా పరుగులు ఇచ్చిన శార్దూల ఠాకూర్ వచ్చే మ్యాచ్ లో బెంచ్ పై కూర్చునే అవకాశాలు మెండు గా ఉన్నాయి.

జయదేవ్ ఉనాద్కట్

India’s Jaydev Unadkat celebrates the dismissal of Sri Lanka’s Niroshan Dickwella during their second Twenty20 international cricket match in Indore, India, Friday, Dec. 22, 2017. (AP Photo/Rajanish Kakade)

డెత్ ఓవర్ స్పెషలిస్ట్ గా మంచి పేరు సాధిస్తున్న జయదేవ్ ఉనాద్కట్, జస్ప్రీత్ బుమ్రా లేని జట్టులో చివరి ఓవర్లలో చాలా ముఖ్య పాత్ర పోషించనున్నారు.

SHARE