ఆశిష్ నెహ్రా భారత్ క్రికెట్ కు గత రెండు దశాబ్దాలలో ఎనలేని సేవ అందించాడు. 2003 ప్రపంచ కప్ లో మరియు 2011 ప్రపంచ కప్ లో భారత్ అంత సక్సెస్ చూసింది అంటే దానిలో నెహ్రా పాత్ర కూడా చాలా ఉంది.

అయితే నెహ్రా చాలా సౌమ్యుడు అని తనతో ఆడిన క్రికెటర్స్ చాలా మంది చెప్పగా ఒకసారి మాత్రం ఆయన ధోని పై ఫీల్డ్ మీదే విరుచుకు పడ్డారు. తన బౌలింగ్ లో సాధారణ క్యాచ్ ను వదిలేసినా ధోని ను గ్రౌండ్ లో దూషించారు.

ఆ వీడియో సోషల్ మీడియా వచ్చాక చాలా పాపులర్ అయింది. 2005 లో పాకిస్తాన్ పై అహ్మదాబాద్ లో జరిగిన వన్ డే లో అప్పట్లో టీం కు కొత్తగా వచ్చిన ధోని, ఆఫ్రిది ఎడ్జ్ చేసిన బంతిని పట్టుకోలేకపోయారు. దానితో నెహ్రా చాలా నిరాశకు గురి అయ్యి తన ఆవేశాన్ని ధోని పై చూపారు.

ఆ సంఘటన మీరే చుడండి

అయితే అది జరిగిన 12 సంవత్సరాల తర్వాత నెహ్రా ను ఆ సంఘటన ఎందుకు జరిగింది అని ప్రశ్న స్టార్ స్పోర్ట్స్ ఆంచారు జతిన్ సంధించారు.

న్యూజిలాండ్ పై తొలి టీ 20 తర్వాత రిటైర్ అయినా నెహ్రా, అదంతా ఆ క్షణం లో ఉన్న పరిస్థితి వల్ల జరిగింది అని. అయితే ఈ వీడియో మహేంద్ర ఐసింగ్ ధోని బాగా పాపులర్ అయినా తర్వాత పాపులర్ అయింది అని చెప్పారు.

ఈ వీడియో చుడండి నెహ్రా అనేక విషయాలు గురించి చెప్పాడు

SHARE