మూడో టీ 20 లో ధోని బాటింగ్ చూసే అవకాశం లభించని తిరువనంతపురం ప్రేక్షకుల నిరాశకు, మాజీ భారత్ కెప్టెన్ తన అద్భుతమైన తెలివితేటలు ఫీల్డ్ లో ఉపయోగించి కనువిందు చేసాడు.

భారత్ ఇన్నింగ్స్ లో ఆఖరి ఓవర్ లో బాటింగ్ కు వచ్చిన ధోని ఒక బంతి కూడా ఆడక ముందే 8 ఓవర్లు ముగిసాయి. అయితే కేవలం 67 పరుగులు చేసిన భారత్ తమ ఫీల్డింగ్, బౌలింగ్ తో అసాధారణ విజయం సాధించింది.

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ చివరిలో 8 బంతుల్లో 21 పరుగులు అవసరమైన సమయం లో బుమ్రా బౌలింగ్ చేసాడు. అప్పటికే మ్యాచ్ ను భారత్ వైపు తిప్పిన బుమ్రా, టామ్ బ్రూస్ కు వేసిన బంతి ని బాట్స్మన్ రివర్స్ స్వీప్ కొట్టేందుకు ప్రయత్నించగా విఫలం చెందాడు.

కానీ పరుగులు ఆవరసం అని గుర్తించిన న్యూజిలాండ్ బాట్స్మెన్ బంతి ధోని దగ్గరకు వెళ్లే సమయానికి పరుగు మొదలు పెట్టారు. అయితే ధోని బంతి ని బుమ్రా దిశగా విసరగా, బుమ్రా నాన్ స్ట్రైకర్ దగర రన్ అవుట్ చేయలేక పోయాడు.

బాల్ మిడ్ ఆన్ దశగా వెళ్లడం చుసిన న్యూజిలాండ్ బాట్స్మన్ మరో పరుగు చేయడం ప్రారంభించారు. అందరు 2 పరుగులు పక్క అనుకున్న సమయం లో హార్దిక్ పాండ్య మిడ్ ఆన్ నుంచి త్వరగా బంతి ని ధోని వైపు గా విసిరాడు.

ఇంత గందరగోళం లో కూడా ధోని తన ప్రశాంతత తో అలోచించి కొంచెంగా ఉన్న వికెట్స్ ను తీసి రన్ అవుట్ చేసాడు.

ఆ వికెట్ మీరే చుడండి

SHARE