భారత క్రికెట్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని శనివారం తో 37 ఏళ్ళు నిండాయి(జూలై 7).

ప్రముఖ వికెట్ కీపర్, బాట్స్మెన్ Ms ధోనీ ప్రస్తుతం ఇంగ్లాండ్లో ఆడుతున్న భారత జట్టులో ఒక భాగం. అతను తన పుట్టినరోజును రెండవ T20I తర్వాత స్నేహితులు, కుటుంబంతో కలిసి జరుపుకున్నాడు. ప్రపంచ కప్ ని  గెలిచిన ఈ విజేత తన భార్య సాక్షి, కుమార్తె జివా ఇంకా అనేక సహచరులతో కేక్ ని కట్ చేశాడు.

తరువాత సురేష్ రైనా Ms ధోనీతో కలిసిన చిత్రని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ అతనికి “‘Happy Birthday’ ని తెలియజేసారు.

రెండవ T2o లో ఇంగ్లాండ్ పైన ధోనీ మెరుగైన ఆటను ఆడారు. భారత్ జట్టు సిరీస్ ని గెలిచి, ధోనికి పుట్టినరోజున మంచి బహుమతిని ఇవ్వాలని శాయాసక్తుల కృషి చేసింది. అయిన మెన్ ఇన్ బ్లూ 5 వికెట్ల తేడాతో ఈ మ్యాచ్ ని ఓడిపోయింది.

భారత్ మొదటి బ్యాటింగ్ చేసి   5 వికెట్ల నష్టానికి 148 పరుగులు సాధించింది. భారత్ 22 పరుగులకే 3 వికెట్లను కోల్పోయి ఆటను పేలవంగా మొదలు పెట్టింది. ఆ సమయం లో విరాట్ కోహ్లి, సురేష్ రైనా మూడో వికెట్ కి 57 పరుగుల విలువైన భాగస్వామ్యంని  జోడించడం ద్వారా భారత్ ఆధిపత్యాన్ని కొనసాగించింది. రైనా 27 పరుగులు చేశాడు. కోహ్లి 47 పరుగులు చేసి టాప్-స్కోరర్ గా నిలిచాడు.ధోని కూడా తన వొంతు గా 24 బంతులలో 32 రన్స్ ని  చేసి భారత్ కు గౌరవప్రదమైన స్కోర్ సాధించడం లో సఫలం అయ్యాడు.ఇంకో విశేషం ఏంటంటే ఇదే ఆటతో ధోని అంతర్జాతీయ క్రికెట్ లో 500వ మ్యాచ్ ఆడిన మూడవ భారతీయుడు అయ్యాడు.

ప్రత్యుత్తరంగా, ఇంగ్లాండ్ ఇంకా 2 బంతులు మిగిలి వుండగానే గెలిచింది. ఆతిథ్య జట్టు 44 పరుగులకే 3 వికెట్లు పడింది. ఆ సమయం లో బాటింగ్ కి వచ్చిన  అలెక్స్ హాలెస్ 58 పరుగుల తో ఆటను తమ వైపు కు తిప్పుకోగాలిగాడు.

ఆదివారం బ్రిస్టల్ లో  సిరీస్ గెలవాలని భారత్ ఎదురు చూస్తోంది.

SHARE