మాంచెస్టర్‌ : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి రికార్డులు కొత్తేం కాదు. భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు అందించిన ధోనీ.. అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు. కెప్టెన్‌గానే కాకుండా ఆటగాడిగానూ పలు రికార్డులు నెలకొల్పాడు. బ్యాట్స్‌మన్‌గా.. కీపర్‌గా పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్న మహేంద్రుడు తాజాగా మరో ప్రపంచ రికార్డును నమోదు చేశాడు.

మాంచెస్టర్‌ వేదికగా ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ధోనీ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.అంతర్జాతీయ టీ20 చరిత్రలో అత్యధిక స్టంపింగ్స్ చేసిన వికెట్ కీపర్‌గా భారత కీపర్ ధోనీ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. మంగళవారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ రెండు స్టంపింగ్స్ చేయడం ద్వారా ఈ రికార్డును చేరుకున్నాడు.13వ ఓవర్లో కుల్‌దీప్‌ యాదవ్ బౌలింగ్‌లో రెండు వరుస బంతుల్లో బెయిర్‌ స్టో, జో రూట్‌ను ధోనీ స్టంపౌట్‌ ద్వారా పెవిలియన్‌కు పంపించాడు.

దీంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక స్టంపౌట్లు చేసిన వికెట్‌కీపర్‌గా అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. ఇప్పటి వరకు 91 మ్యాచ్‌లాడిన ధోనీ 90 ఇన్నింగ్స్‌ల ద్వారా 33 స్టంపౌట్లు చేశాడు. కమ్రాన్‌ అక్మల్‌ (32, పాకిస్థాన్‌), మహమ్మద్‌ షజాద్‌(28, అఫ్గానిస్థాన్‌) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

టీ20ల్లో టాప్ 5 స్టంపింగ్ చేసిన ఆటగాళ్లు :

Most stumpings in career
Player Span Mat Inns St
MS Dhoni (INDIA) 2006-2018 91 90 33
Kamran Akmal (PAK) 2006-2017 58 53 32
Mohammad Shahzad (AFG) 2010-2018 63 62 28
Mushfiqur Rahim (BDESH) 2006-2018 71 65 26
KC Sangakkara (SL) 2006-2014 56 56 20

 

SHARE