ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్ క్రిస్ట్ మాజీ భారత్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పై ప్రశంసల వర్షం కురిపించాడు. ధోని ని ప్రపంచంలోనే అత్యుత్తమ స్టాంపింగ్ చేసే వికెట్ కీపర్లు జాబితా లో చేర్చాడు.

36 ఏళ్ళ ధోని స్టాంపింగ్ లో తనకంటే మెరుగైన కీపర్ లేడని చాల సార్లు అభిమానులు అనుకునేలా చేసిన విషయం తెల్సిందే. ఒక సరి స్పిన్నర్ బాట్స్మన్ ను బోల్తా కొట్టిస్తే ధోని తన మెరుపు వేగం తో చాలా సార్లు భారత్ కు వికెట్స్ తెచ్చిపెట్టాడు.

ప్రపంచం క్రికెట్ చరిత్రలో అల్ టైం బెస్ట్ వికెట్ కీపర్ గా భావించే ఆడమ్ గిల్ క్రిస్ట్ గురువారం ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ, ” ధోని ఒక కీపర్ గాను, ఒక కెప్టెన్ గాను, ఒక బాట్స్మన్ గాను తను ఆడిన విధానం చాలా ప్రశంసనీయం. ఆయన అన్ని రంగాల్లోనూ సక్సెస్ చూసారు,” అని చెప్పారు.

తన సొంత కెరీర్ లో అత్యుత్తమ ఇన్నింగ్స్ గురించి ప్రశ్నించగా, ఆయన నిస్సందేహం గా 2007 ప్రపంచ కప్ ఫైనల్ లో చేసిన సెంచరీ ని ఎంచుకున్నారు. 104 బంతుల్లో 149 పరుగులు చేసి ఆడమ్ గిల్ క్రిస్ట్ ఒంటి చేత్తో ఆస్ట్రేలియా కు ఫైనల్ గెలిచి పెట్టారు.

” నా పర్ఫెక్ట్ ఇన్నింగ్స్ అంటే అది 2007 ప్రపంచ కప్ ఫైనల్ అనే చెప్పాలి. ప్రతి క్రీడాకారుడు పెద్ద ఈవెంట్స్ లో ఆడేందుకు ఎంతో పరితపిస్తాడు కానీ అన్ని సార్లు అనుకున్నట్టు అవ్వదు,” అని చెప్పుకొచ్చారు.

“పూర్వము ప్రపంచ కప్ ఫైనల్స్ లో నా పెర్ఫార్మన్స్ సాధారణం గా ఉండేది. కానీ అందరికి ప్రపంచ కప్ ఫైనల్ లో సెంచరీ కొట్టాలని ఉంటుంది. అది నాకు 2007 లో జరిగింది అందుకే అది నా పర్ఫెక్ట్ పెర్ఫార్మన్స్.”

ఈ నెల చివరిలో జరిగే యాషెస్ సిరీస్ లో ఎవరిని ఫేవరెట్ గా భావిస్తున్నారు అని ప్రశ్నించగా, గిల్ క్రిస్ట్ రెండు జట్లు సరి సమానంగా ఉన్నాయి అని చెప్పారు. అయితే ఆస్ట్రేలియా కు ఉన్న బలమైన బౌలింగ్ విభాగం వల్ల ఆసీస్ ఫేవరెట్ గా సిరీస్ మొదలు పెడతారు అని చెప్పారు.

SHARE