బ్రిస్టల్: ఎన్నో రికార్డులు.. మరెన్నో అవార్డులు అందుకుంటూ ముందుకు సాగుతున్న టీంఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ …‌మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లో భాగంగా బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్ వేదకగా జరుగుతున్న మూడో టీ-20 మ్యాచ్‌లో అరుదైన రికార్డు సాధించాడు. ఒక అంతర్జాతీయ టీ-20లో ఐదు క్యాచులు పట్టిన కీపర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ధోనీ రాయ్, హేల్స్, మోర్గన్, బ్రిస్టో, ప్లంకెట్‌ల క్యాచ్‌లు అందుకున్నాడు. దీంతో ఈ అరుదైన ఘనతను సాధించిన తొలి క్రికెటర్‌గా ధోనీ నిలిచాడు.
దీంతో పాటు అంతర్జాతీయ టీ-20ల్లో 50 క్యాచులు అందుకున్న తొలి వికెట్‌కీపర్‌గా, టీ-20ల్లో 150 క్యాచ్‌లు అందుకున్న తొలి వికెట్ కీపర్‌గా ధోనీ నిలిచాడు. దీంతో పాటు ఒక అంతర్జాతీయ టీ-20లో ఆరు వికెట్లు తీయడంతో పాత్ర పోషించిన తొలి వికెట్ కీపర్‌గా ధోనీ రికార్డు సృష్టించాడు.ధోని తరువాతి స్థానాలో దినేష్ రాందిన్ 34 వికెట్లు,సౌతాఫ్రికా కి చెందిన క్విన్టన్ డి కాక్ 30 వికెట్లు,పాకిస్తాన్ కి చెందిన కమ్రాన్ అక్మల్ 28,నెదర్లాండ్స్నేతేర్లన్డ్స్ కి చెందిన వెస్లీ బరేస్సి వున్నారు.
కాగా ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లో భాగంగా బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్ వేదకగా జరిగిన మూడో టీ-20 మ్యాచ్‌లో టీం ఇండియా అద్భుత విజయం సాధించింది

SHARE