మాజీ భారత్ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ ఇటీవలే అభిమానులు సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతూ తనను ఇంగ్లాండ్ కెప్టెన్ నాస్సర్ హుస్సేన్ బస్సు డ్రైవర్ గా సంబోధించినట్టు తెలిపాడు.

ఐతే ఈ సంఘటన జరిగి 16 సంవత్సరాలు అయ్యింది. 2002 నాట్ వెస్ట్ సిరీస్ ఫైనల్ లో మొహమ్మద్ కైఫ్ మరియు యువరాజ్ సింగ్ భారత్ జట్టు ను సంచలన విజయానికి తీసుకువెళ్లారు. లార్డ్స్ లో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ జట్టు 326 పరుగులు టార్గెట్ ను ఛేదించి చారిత్రాత్మక విజయం సాధించిన విజయం అందరికి తెలిసిందే.

భారత్ క్రికెట్లోకి సరికొత్త ఫీల్డింగ్ స్టాండర్డ్ పట్టు కొచ్చిన మొహమ్మద్ కైఫ్ మరియు యువరాజ్ సింగ్, ఆ మ్యాచ్ లో చేసిన అద్భుతమైన పార్టీనేర్షిప్ భారత్ క్రికెట్ అభిమానులు ఇప్పటికి మరిచిపోలేరు. 141 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్ జట్టు ఆశలు వదులుకున్న సమయం, కైఫ్ మరియు యువరాజ్ సంచలన ఇన్నింగ్స్ తో భారత్ కు విజయం అందించారు.

ఐతే ట్విట్టర్ లో అభిమానులు ప్రశ్నలకు సమాదానాలు చెప్పిన కైఫ్ ను ఒక అభిమాని, “కైఫ్, 2002 నాట్ వెస్ట్ ఫైనల్ లో మీరు యువి ఏం మాట్లాడుకున్నారు. ఎవరైనా ఇంగ్లాండ్ ఆటగాళ్లు మీ పై స్లెడ్జింగ్ చేశారా?,” అని అడిగాడు.

MANCHESTER, ENGLAND – SEPTEMBER 19: Sky TV pundit Nasser Hussain looks on before the 1st Royal London One Day International match between England and West Indies at Old Trafford on September 19, 2017 in Manchester, England. (Photo by Stu Forster/Getty Images)

ఆ ప్రశ్నకు సమాధానం చెబుతూ కైఫ్, “అవును, నాస్సర్ హుస్సేన్ నన్ను బస్సు డ్రైవర్ అని సంబోధించాడు. అయితే వారిని ఒక రైడ్ తీసుకువెళ్లడం చాలా ఆనందం గా అనిపించింది,” రిప్లై ఇచ్చాడు.

నాస్సర్ హుస్సేన్ కు భారత్ క్రికెటర్ల పై ఎప్పుడు మక్కువ తక్కువే. అతను స్కై స్పోర్ట్స్ కు కామెంటేటర్ అయ్యిన తరువాత కూడా కొన్ని సార్లు భారత్ కామెంటేటర్ లతో మాటల యుద్ధం చేసే వాడు.

SHARE