ఆర్మీ లో లెఫ్ట్ నెంట్ కల్నల్ పదవి లో ఉన్న మాజీ భారత్ కెప్టెన్ ఎం ఎస్ ధోని, ఇటీవలే జమ్మూ కాశ్మీర్ లో ఒక ఆర్మీ స్కూల్ ను సందర్శించారు.

అక్కడే మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, భారత్ పాక్ క్రికెట్ సంబంధాలు గురించి మాట్లాడుతూ ఆయన భారత్ గవర్నమెంట్ తీసుకొనే నిర్ణయం పై ఇరు దేశాల మధ్య క్రికెట్ ఆధారపడివుంటుంది అని చెప్పారు.

Britain Cricket – India v Sri Lanka – 2017 ICC Champions Trophy Group B – The Oval – June 8, 2017 India’s MS Dhoni in action Action Images via Reuters / Peter Cziborra Livepic EDITORIAL USE ONLY. – RTX39MT2

శ్రీలంక పై ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ సిరీస్ సమయం లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బిసిసిఐ విరుచుకుపడ్డాడు. భారత్ చాలా మ్యాచులు ఈ మధ్య కాలంలో ఆడటం వచ్చే సౌత్ ఆఫ్రికా సిరీస్ కు సన్నద్ధం కావడానికి సరైన సమయం లేదని కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

భవిష్యత్తు ఇలా మళ్ళీ జరగకుండా ఉండేందుకు బోర్డు జాగ్రత్తలు తీసుకోవాలి అని కూడా కోహ్లీ సూచించాడు. డిసెంబర్ 24 న శ్రీలంక తో సిరీస్ ముగుస్తుంది ఆ తర్వాత రెండు రోజుల్లో భారత్ జట్టు సౌత్ ఆఫ్రికా పయనం అవుతుంది.

సౌత్ ఆఫ్రికా పై మూడు టెస్టులు, ఆరు వన్ డే లు, మూడు టీ 20 మ్యాచులు ఆడనున్న టీం ఇండియా, ఓవర్సీస్ పిచ్లకు అలవాటు పడేందుకు సమయం లేకపోవడం గమనార్హం.

ధోని కూడా కోహ్లీ ఈ విషయం పై సమర్ధించాడు. ఆయన మాట్లాడుతూ, “ఈ సారి భారత్ జట్టు చాలా ఆలస్యం గా సౌత్ ఆఫ్రికా కు బయలుదేరనున్నారు. దీని వల్ల జట్టు టెస్ట్ సిరీస్ ముందు తాయారు కావడానికి చాలా తక్కువ సమయం ఉండనుంది.”

అయితే ప్రస్తుతం ఉన్న భారత్ టెస్ట్ జట్టు లో చాలా మంది ఓవర్సీస్ పిచ్ పై ఆడినవాళ్ళే కావడం తో ధోని భారత్ జట్టు చక్కగా రాణించావొచ్చు అని అభిప్రాయపడ్డారు.

టెస్టుల నుండి 2014 డిసెంబర్ లో రిటైర్ అయినా ధోని, సౌత్ ఆఫ్రికా పై వన్ డేలు, టీ 20 లో ఆడనున్నాడు. అయితే ఇది తన తొలి పర్యటన కాక పోయిన ధోని మాత్రం ఆఫ్రికా సిరీస్ చాలా క్లిష్టమైంది అని అభిప్రాయపడ్డాడు.

“వన్ డే జట్టు త్వరగా సౌత్ ఆఫ్రికా వెళ్తే అక్కడి పరిస్థితులకు బాగా అలవాటు పడొచ్చు. సౌత్ ఆఫ్రికా సిరీస్ చాలా ఛాలెంజ్ తో కూడినది.”

SHARE